Sayaji Shinde: షియాజీ షిండే Sayaji Shinde ఒక మరాఠి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ రైతు కుటుంబానికి చెందిన వారే. మెగాస్టార్ చిరంజీవి నటించి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచినా ఠాగూర్ సినిమా తో ఈయన తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. మరాఠి అయ్యి ఉండి తెలుగులో తన మొదటి సినిమాకి తానే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకొని విలన్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే షియాజీ షిండే సినీ పరిశ్రమకు పరిచయం కాకముందు తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారట.
షియాజీ షిండే జన్మస్థలం మహారాష్ట్రలోని సతారా జిల్లా. ఈయనకు నలుగురు అక్క చెల్లెలు మరియు ఒక సోదరుడు ఉన్నారు. షియాజీకి టీచర్ కావాలని చిన్నప్పటి నుంచి కోరికట. పై చదువులకు ఖర్చు అవుతుందని గ్రహించిన షియాజీ తనకు ఉన్న విద్యార్హతను ఆధారంగా వాచ్ మెన్ గా పనిచేశారు. ఈ ఉద్యోగం వచ్చాక రాత్రి వాచ్ మెన్ గా పనిచేసి పగలు కాలేజీ క్లాసులకు వెళ్లేవారట.
షియాజీ షిండే కు ఎప్పటి నుంచో నటుడు కావాలనే కోరిక ఉందట. ఈ విధంగా అయితే తాను నటుడుని కాలేనని గ్రహించిన ఆయన అన్నీ వదిలేసి 1982 లో ముంబయ్ వెళ్ళిపోయారట. అక్కడ ఆయన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తన నటనకు మెరుగులు దిద్దుకుంటూ ఉన్న సమయంలో 1997వ సంవత్సరంలో మొదటిసారి ఒక మరాఠీ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట.
ఆ తర్వాత ఆయనకీ తమిళ, తెలుగు సినిమాలలో అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక అక్కడ నుంచి ఆయన తన జీవితంలో మళ్ళి వెనుతిరిగి చూసుకోవాలిసిన అవసరం రాలేదు. ఇలా షియాజీ షిండే తాను కోరుకున్న దిశగా తన జీవితాన్నిమలుచుకుని పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?