SBI: కస్టమర్లను అప్రమత్తం చేస్తున్న SBI, రేపు అవి పనిచేయవు!

Share

State Bank of India: ఇండియా మొత్తంలో పేరుగాంచిన బ్యాంకు ఏదైనా వుంది అంటే.. అది SBI బ్యాంకు (స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా) మాత్రమే. ఎప్పటికప్పుడు తన పాలసీలు మారుస్తూ కస్టమర్లను పలురీతిలో ఆకట్టుకుంటుంది. ఇండ్లపై రుణాలు, బంగారంపై తక్కువ వడ్డీ రుణాలు, వాణిజ్యపరమైన రుణాలు ఇలా ఒక్కటేమిటి.. అనేక విధాలుగా మధ్యతరగతి వారికి ఉపయోగపడే విధంగా వీరు అనేక పాలసీలు తీసుకువచ్చి సేవలు అందిస్తూ వుంటారు. అందువలనే భారతీయ పౌరులకు ఇంచుమించుగా ఇందులో ఖాతా ఉంటుంది.

రేపు ఈ సేవలు నిలిచివేయబడతాయి:

తాజాగా తన కస్టమర్లకు SBI కీలక ప్రకటన విడుదల చేసింది. అదేమిటంటే, మెయింటనెన్స్ లో భాగంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను రేపు అనగా, డిసెంబర్ 11న(శనివారం) నాడు నిలిపి వేస్తున్నట్టు SBI ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో ఈ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కస్టమర్లను కోరింది. అలాగే యోనో, యోనో లైట్‌, యూపీఐ సర్వీసులు కూడా 300 నిమిషాల పాటు, అంటే సుమారు ఓ 5 గంటల పాటు పనిచేయవని సమాచారమిచ్చారు.

ఏ సమయంలో పనిచేయవు?

డిసెంబర్ 11, 2021న అర్ధరాత్రి 23:30 గంటల నుంచి డిసెంబర్ 12 ఉదయం 04.30 సమయం వరకు పనిచేయవని పేర్కొన్నారు. దయచేసి ఈ విషయాన్ని యూజర్లు గమనించి, అర్ధం చేసుకొంటారని ట్వీట్‌లో పేర్కొంది. ఇకపోతే అవసరాన్ని బట్టి SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను అప్పుడప్పుడు ఇలా బంద్ చేస్తూ ఉండటం మనం గమనించవచ్చు. మొన్న అక్టోబర్ నెలలో ఒకసారి మెయింటనెన్స్ చేపట్టింది. మరలా ఇపుడు మెయింటనెన్స్ వర్క్ చేపడుతూ ఉంది. యావత్ భారత దేశంలోనే SBIకి 22 వేలకు పైనే బ్రాంచులు ఉన్నట్టు సమాచారం. ఇక ఎటిఎం మెషీన్స్ అయితే లెక్కేలేదు. సుమారు 57,890కి పైగా ఏటీఎంలు ఉన్నట్టు భోగట్టా!


Share

Related posts

కొందరు సంపన్నులు కుళ్లిన బంగాళాదుంపలు

Siva Prasad

ఆంధ్ర దాటుతున్న ఫొని

somaraju sharma

KTR: సరికొత్త బిరుదుతో మంత్రి కేటీఆర్ కి బర్త్ డే విషెస్ తెలిపిన సోను సూద్..!!

sekhar