న్యూస్

SBI: భారత ఆర్మీతో ఓ ఒప్పందం చేసుకున్న SBI…

Share

SBI: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయినటువంటి SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తాజాగా మన భారత ఆర్మీ సిబ్బందికి ఓ శుభవార్త చెప్పింది. ఇది విని ప్రముఖ బ్యాంకు ప్రతినిధులు కొంతమంది SBIని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సాధారణంగా కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లను అట్రాక్ట్ చేయడం కోసం ఎన్నో పాలసీలను ప్రవేశ పెట్టడం, మనం చూస్తూ ఉంటాం. అలాంటిది అతి పెద్ద బ్యాంకు అయినటువంటి SBI మన దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న మిలిటరీ దళాలకు ఫేవర్ చేయడం అనేది మెచ్చుకోదగ్గ విషయమే.

SBI Bank: మీరు వ్యాపారులా? అయితే SBI ప్రకటన వెంటనే చూడండి!

ఇంతకీ ఆ ఒప్పందం ఏమిటి?

జవాన్లందరికీ ‘డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ’ అనే స్కీమ్ ద్వారా వివిధ ప్రయోజనాలను అందించడానికి భారత సైన్యంతో ఓ అవగాహన ఒప్పందం చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు.. SBI మెరుగైన కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ (డెత్) కవర్, ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ (డెత్) కవర్, శాశ్వత/పాక్షిక డిజేబుల్ కవర్లను వారికి అందిస్తుంది. దీనితో పాటుగా హోంలోన్, కారు లోన్, ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్‌పై భారత సైన్యానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, రాయితీ ప్రాసెసింగ్ ఛార్జీలను SBI అందిస్తుంది.

SBI: కస్టమర్లను అప్రమత్తం చేస్తున్న SBI, రేపు అవి పనిచేయవు!
ఇది ఎవరికి వర్తిస్తుంది?

ఈ విషయమై చాలామందికి అనేక అనుమానాలు ఉండవచ్చు. కానీ వాటిని పటాపంచలు చేస్తూ SBI సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం సేవలందిస్తున్న ఆర్మీ సిబ్బందితో పాటు రిటైరైన వారికి, అలాగే వారి కుటుంబాలకు కూడా ఈ ప్రయోజనాలు చేకూరనున్నాయి. అలాగే అమరులైన సైనిక సిబ్బంది పిల్లల విద్య, బాలికల వివాహానికి కూడా కొత్త ఒప్పంద పథకం మద్దతు ఇస్తుంది.


SBI alert: అలెర్ట్ అలెర్ట్ …ఎస్బిఐ కస్టమర్లకు అలెర్ట్ …!

దీని ప్రకారం, రక్షణ సిబ్బంది అందించిన సేవలను గుర్తిస్తూ, SBI అనేక కాంప్లిమెంటరీ ప్రయోజనాలు, సేవా ఛార్జీల మినహాయింపుతో జీరో-బ్యాలెన్స్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలను కూడా అందిస్తుంది. మరిన్ని వివరాలకు SBI వ్యక్తిగత పోర్టల్/ట్విట్టర్ చూడగలరు.


Share

Related posts

Nara Lokesh: ఏపి సీఎం వైఎస్ జగన్ కు నారా లోకేష్ ప్రశ్నాస్త్రాలతో లేఖ

somaraju sharma

జనవరి ఫస్ట్ నుంచి జగన్ సర్కార్ పాలనలో మరో నూతన అడుగు..!!

sekhar

AP Cabinet: 7న ఏం జరగబోతుంది..!? క్యాబినెట్ భేటీకి హాట్ హాట్ టాపిక్స్ సిద్దం..!

somaraju sharma