Categories: న్యూస్

SBI New Rules : SBI ఖాతాదారులకు అలర్ట్.. కొత్త రూల్స్ ఇవే..!

Share

SBI New Rules : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ కొత్త నిబంధనల వల్ల బ్యాంకు ఖాతాదారులపై ఎంతోకొంత ప్రభావం పడనుంది. ముఖ్యంగా లావాదేవీలు జరిపే వారి విషయంలో కొత్త రూల్స్ ప్రభావం చూపించనున్నాయి. అందుకే ఫిబ్రవరి నుంచి వచ్చే రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

SBI New Rules : కొత్త రూల్స్ ఇవే..!

ఎస్‌బీఐ బ్యాంకు తాజాగా ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ రూల్స్‌లో సరికొత్త మార్పులు తీసుకువచ్చింది. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) రూల్స్‌ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న ఐఎంపీఎస్ లిమిట్‌ను పెంచుతున్నామని ఎస్‌బీఐ వెల్లడించింది. దీంతో ఇకపై ఖాతాదారులు ఐఎంపీఎస్ ద్వారా సింగిల్ ట్రాన్సాక్షన్ లో రూ.5 లక్షల వరకు నగదు పంపించవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ లిమిట్ కేవలం రూ.2 లక్షల వరకే ఉంది. ఈ లిమిట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి చాలామంది ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఐఎంపీఎస్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లపై ఎలాంటి రుసుములు వసూలు చేయమని ఎస్‌బీఐ తాజాగా తెలిపింది. కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో ద్వారా ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లకు చేస్తే ఛార్జీలు నుంచి మినహాయింపు పొందుతారు. ఒకవేళ మీరు ఆన్‌లైన్ పద్ధతిలో కాకుండా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని భావిస్తే ఛార్జీలు వర్తిస్తాయి.

రూల్స్ తీసుకురావడానికి కారణం ఇదే

డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే కొత్త రూల్స్ అమలు చేయడానికి రెడీ అయ్యామని ఎస్‌బీఐ వెల్లడించింది. కొత్త రూల్స్ ఫిబ్రవరి నుంచి అమలులోకి రానుండగా దీన్ని ఖాతాదారులు దృష్టిలో పెట్టుకొని తదుపరి పనులను ప్లాన్ చేసుకుంటే మంచిది. ప్రస్తుతం ఎస్‌బీఐ టూవీలర్ లోన్ కూడా అందిస్తోంది. ఈ లోన్స్ ను తక్కువ మొత్తం ఈఎంఐలతో ఆఫర్ చేస్తోంది. రూ. 10 వేల రుణ మొత్తానికి రుణగ్రహీతలు ఈఎంఐ రూ. 251 కట్టుకుంటే సరిపోతుంది. రుణ గ్రహీతలు రూ.20 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. 48 నెలల లోగా రుణం చెల్లించాల్సి ఉంటుంది.

SBI కస్టమర్లకు శుభవార్త! సెకండ్లలో మీ అకౌంట్‌లోకి డబ్బులు! న్యూ ఇయర్ బొనాంజా!


Share

Recent Posts

దృశ్యం 3 నుంచి అదిరిపోయే అప్‌డేట్.. చివరికి హీరో అరెస్ట్ అవుతాడా..?

  ఆద్యంతం ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్న…

21 mins ago

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారపదార్ధాల జోలికి అసలు పోకండి..!

మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పడంలో. ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ముఖ్యంగా మానవుని శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర…

21 mins ago

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

51 mins ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

1 hour ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

3 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

4 hours ago