NewsOrbit
న్యూస్

ఎస్‌బీఐ డెబిట్ కార్డుకు కొత్త సేఫ్టీ ఫీచ‌ర్‌.. ఏంటో తెలుసా..?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తూనే వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా డెబిట్ కార్డు వినియోగ‌దారుల‌కు మ‌రొక కొత్త సేఫ్టీ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచ‌ర్ స‌హాయంతో ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు త‌మ డెబిట్ కార్డుల‌ను సుల‌భంగా బ్లాక్ చేసుకోవ‌చ్చు. కార్డు పోయింద‌ని భావించిన వారు వెంట‌నే ఎస్ఎంఎస్ చేయ‌డం ద్వారా కార్డును బ్లాక్ చేయ‌వ‌చ్చు. దీంతో క‌స్ట‌మ‌ర్ కేర్ క‌న్నా చాలా వేగంగా కార్డును బ్లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

sbi new safety feature for its debit card

ఎస్‌బీఐ డెబిట్ కార్డు వినియోగ‌దారులు పోయిన త‌మ కార్డును బ్లాక్ చేయాలంటే.. ముందుగా త‌మ మొబైల్ నంబ‌ర్‌ను బ్యాంక్ రికార్డుల్లో అప్‌డేట్ చేసుకుని ఉండాలి. త‌రువాత ఆ నంబ‌ర్ ఉన్న ఫోన్‌తో BLOCK అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి డెబిట్ కార్డు చివ‌రి 4 అంకెల‌ను టైప్ చేయాలి. అనంత‌రం ఆ మెసేజ్‌ను 567676 అనే నంబ‌ర్‌కు పంపించాలి. దీంతో కార్డు బ్లాక్ అయిన‌ట్లు క‌న్ఫ‌ర్మేష‌న్ మెసేజ్ వ‌స్తుంది. అందులో టిక్కెట్ నంబ‌ర్ ఉంటుంది. అలాగే కార్డు బ్లాక్ అయిన తేదీ, స‌మ‌యం త‌దిత‌ర వివ‌రాలు ఉంటాయి. ఇలా ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు త‌మ డెబిట్ కార్డుల‌ను సుల‌భంగా బ్లాక్ చేయ‌వ‌చ్చు.

అయితే ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా డెబిట్ కార్డుల‌ను బ్లాక్ చేయ‌వ‌చ్చు. అందుకుగాను www.onlinesbi.com అనే సైట్‌లోకి లాగిన్ అయి ATM Card Services లో ఉండే e-Services అనే ట్యాబ్‌లోని Block ATM Card అనే లింక్‌ను ఎంచుకోవాలి. అనంత‌రం వ‌చ్చే పేజీలో యాక్టివ్‌, బ్లాక్ అయి ఉన్న అన్ని కార్డుల వివ‌రాలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. అందులో కార్డుల‌కు చెందిన మొద‌టి, చివ‌రి 4 అంకెలు క‌నిపిస్తాయి. ఏదైనా కార్డును ఎంచుకుని కింద స‌బ్‌మిట్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి. అనంత‌రం వ‌చ్చే వివ‌రాల‌ను వెరిఫై చేయాలి. ఓటీపీ ద్వారా లేదా ప్రొఫైల్ పాస్‌వ‌ర్డ్ ద్వారా ఆథెంటికేష‌న్ ఇవ్వాలి. దీంతో రిక్వెస్ట్ స‌బ్‌మిట్ అవుతుంది. అనంత‌రం కార్డు బ్లాక్ అయిన‌ట్లు మెసేజ్ వ‌స్తుంది. అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా కార్డు బ్లాకింగ్ స‌ర్వీస్ ఇప్ప‌టికే అందుబాటులో ఉన్నా.. ఎస్‌బీఐ తాజాగా ఎస్ఎంఎస్ ద్వారా కూడా డెబిట్ కార్డును బ్లాక్ చేసేలా కొత్త సేఫ్టీ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

author avatar
Srikanth A

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!