NewsOrbit
Featured న్యూస్

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త‌… ఉచితంగా రూ.20 ల‌క్ష‌ల‌ ఇన్సూరెన్స్‌..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న క‌స్ట‌మ‌ర్లకు శుభ‌వార్త చెప్పింది. ఎస్‌బీఐ డెబిట్ కార్డుల‌ను వాడేవారికి రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచితంగా ఇన్సూరెన్స్ స‌దుపాయాన్ని అంద‌జేస్తోంది. అయితే భిన్న ర‌కాల డెబిట్ కార్డుల‌పై భిన్నంగా ఇన్సూరెన్స్ ల‌భిస్తుంది. కానీ ఇన్సూరెన్స్ స‌దుపాయాన్ని పొందాలంటే క‌స్ట‌మ‌ర్లు ఎస్‌బీఐ డెబిట్ కార్డుల‌ను వాడాల్సి ఉంటుంది.

sbi offers upto rs 20 lakhs free insurance for its customers

ఎస్‌బీఐ త‌న‌ క‌స్ట‌మ‌ర్ల‌కు యాక్సిడెంట‌ల్‌, డెత్ ఇన్సూరెన్స్‌ను ఈ ఆఫ‌ర్ కింద అంద‌జేస్తోంది. విమాన ప్ర‌యాణానికి కూడా యాక్సిడెంట‌ల్‌, డెత్ ఇన్సూరెన్స్‌ను ఇస్తారు. అందుకు గాను క‌స్ట‌మ‌ర్లు డెబిట్ కార్డుతో విమాన టిక్కెట్ల‌ను కొనుగోలు చేసి ఉండాలి. అలాగే ప్ర‌మాదం జ‌రగ‌డానికి ముందు 90 రోజుల్లో డెబిట్ కార్డును ఏదో ఒక రూపంలో వాడి ఉండాలి. ఇక రోడ్డు ప్ర‌మాదం అయితే ప్ర‌మాదం జ‌రిగేందుకు ముందు 90 రోజులలో డెబిట్ కార్డును ఏదో ఒక రూపంలో వాడి ఉంటే చాలు. ఈ రెండు సంద‌ర్భాల్లోనూ ఎస్‌బీఐ డెబిట్ కార్డుల‌ను వాడే క‌స్ట‌మ‌ర్ల‌కు ఉచితంగా ఇన్సూరెన్స్‌ను అందిస్తారు.

ఇక ఎస్‌బీఐ వీసా సిగ్నేచ‌ర్ డెబిట్ కార్డును క‌లిగి ఉండి రూ.1 లక్ష వ‌ర‌కు ప్రొటెక్ష‌న్ క‌వ‌ర్‌ను తీసుకున్న వారికి రూ.20 ల‌క్ష‌ల ఉచిత ఇన్సూరెన్స్‌ను అందిస్తారు. అలాగే భిన్న ర‌కాల ఎస్‌బీఐ డెబిట్ కార్డుల‌కు అందించే ఉచిత ఇన్సూరెన్స్ మొత్తాలు కూడా భిన్నంగా ఉన్నాయి.

* ఎస్‌బీఐకి చెందిన గోల్డ్ డెబిట్ కార్డు (వీసా, మాస్ట‌ర్ కార్డ్‌) దారుల‌కు ప‌ర్స‌న‌ల్ యాక్సిడెంట్ (డెత్‌) క‌వ‌ర్ రూ.2 ల‌క్ష‌లు, ఎయిర్ యాక్సిడెంట్ (డెత్‌) క‌వ‌ర్ రూ.4 ల‌క్ష‌లు ల‌భిస్తుంది.
* ఎస్‌బీఐ యువ వీసా కార్డు దారుల‌కు ప‌ర్స‌న‌ల్ యాక్సిడెంట్ (డెత్‌) క‌వ‌ర్ రూ.2 ల‌క్ష‌లు, ఎయిర్ యాక్సిడెంట్ (డెత్‌) క‌వ‌ర్ రూ.4 ల‌క్ష‌లు ల‌భిస్తుంది.
* ఎస్‌బీఐ ప్లాటినం కార్డ్‌ (వీసా, మాస్ట‌ర్ కార్డ్‌) దారుల‌కు రూ.5 లక్ష‌ల పర్స‌న‌ల్ యాక్సిడెంట్ (డెత్‌) క‌వ‌ర్‌ను, రూ.10 ల‌క్ష‌ల ఎయిర్ యాక్సిడెంట్ (డెత్) క‌వ‌ర్‌ను అందిస్తారు.
* ఎస్‌బీఐ ప్రైడ్ కార్డ్ (బిజినెస్ డెబిట్‌, మాస్ట‌ర్‌, వీసా కార్డ్‌) దారుల‌కు రూ.2 ల‌క్ష‌లు, రూ.4 ల‌క్ష‌ల క‌వ‌ర్‌ను ఆయా విభాగాల్లో అందిస్తారు.
* ఎస్‌బీఐ ప్రీమియం కార్డ్ (బిజినెస్ డెబిట్‌, మాస్ట‌ర్‌, వీసా కార్డ్‌) దారుల‌కు రూ.5 ల‌క్ష‌లు, రూ.10 ల‌క్ష‌ల క‌వ‌ర్‌ను అందిస్తారు.
* ఎస్‌బీఐ వీసా సిగ్నేచ‌ర్ డెబిట్ కార్డు దారుల‌కు రూ.10 ల‌క్ష‌లు, రూ.20 ల‌క్ష‌ల క‌వ‌ర్‌ను ఆయా విభాగాల్లో అందిస్తారు.

author avatar
Srikanth A

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju