NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎప్పుడో తెలిస్తే షాకే..ఎస్‌బీఐ ఏం చెప్తుందదంటే…

Corona: క‌రోనా విష‌యంలో ఇప్పుడు అంద‌రి చూపు థర్డ్ వేవ్ పై ప‌డింది. క‌రోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తుండ‌గా మూడో వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా సంచ‌ల‌న వివ‌రాలు వెలువ‌రించింది. వ‌చ్చే ఆగ‌స్ట్‌లోనే ఈ మూడో వేవ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని త‌న తాజా నివేదిక‌లో హెచ్చ‌రించింది. కొవిడ్ థ‌ర్డ్ వేవ్ పీక్ సెప్టెంబ‌ర్‌లో ఉంటుంద‌నీ ఈ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. దీంతో సాక్ కు లోన‌వ‌డం సామాన్యుల వంతు అవుతోంది.

 

Read More : Corona: క‌రోనా వ్యాక్సిన్‌.. ఓ గుడ్ న్యూస్‌.. ఇంకో బ్యాడ్ న్యూస్

ఇది నివేదిక‌..

కొవిడ్‌-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో ఎస్‌బీఐ త‌న ప‌రిశోధ‌న నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఇండియాలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన న‌మోదైంద‌ని ఈ నివేదిక వెల్ల‌డించింది. క‌రోనా థ‌ర్డ్ వేవ్ స‌గ‌టు పీక్ స్టేజీ కేసులు రెండో వేవ్ పీక్ స్టేజీలో న‌మోదైన కేసుల కంటే 1.7 రెట్లు ఎక్కువ‌గా ఉండ‌నున్న‌ట్లు గ్లోబ‌ల్ డేటా చెబుతోంది. ప్ర‌స్తుతం డేటా ప్ర‌కారం చూసుకుంటే ఇండియాలో జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు న‌మోదు కావ‌చ్చు. అయితే ఆగ‌స్ట్ రెండో ప‌క్షంలో కేసుల సంఖ్య మ‌ళ్లీ భారీగా పెర‌గొచ్చ‌ని ఎస్‌బీఐ రిపోర్ట్ అంచ‌నా వేసింది. ఆగ‌స్ట్ రెండో పక్షంలో కేసుల సంఖ్య క్ర‌మంగా పెర‌గ‌డం ప్రారంభ‌మై.. నెల‌లోపు పీక్ స్టేజీకి వెళ్లే చాన్స్ ఉంది.

Read MOre: Corona: గుడ్ న్యూస్ః150కే హైద‌రాబాద్‌లో క‌రోనా టీకా

వ్యాక్సినేష‌న్ల సంగ‌తి చూస్తే..
దేశంలో స‌గ‌టున రోజుకు 40 ల‌క్ష‌ల‌ వ్యాక్సిన్లు ఇస్తున్నారని ఎస్‌బీఐ తెలిపింది. దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 4.6 శాతం కాగా.. 20.8 శాతం మంది తొలి డోసు వేసుకున్నారు. కాగా, గ‌తంలో క‌రోనా హాట్‌స్పాట్‌గా మారిన దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై కీల‌క మైలురాయిని చేరుకుంది. న‌గ‌ర జ‌నాభాలో వ్యాక్సినేష‌న్‌కు అర్హ‌త ఉన్న వారిలో స‌గం మంది కొవిడ్‌-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నార‌ని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) వెల్ల‌డించింది. న‌గ‌రంలో 90 ల‌క్ష‌ల మంది 18 ఏండ్లు పైబ‌డిన జ‌నాభా ఉండ‌గా 45 ల‌క్ష‌ల మంది ఇప్ప‌టివ‌ర‌కూ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నార‌ని తెలిపింది. 11.5 ల‌క్ష‌ల మంది వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకున్నార‌ని స్ప‌ష్టం చేసింది.

author avatar
sridhar

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju