NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Rohit Ranjan: జర్నలిస్ట్ రోహిత్ రంజన్ పిటిషన్ అత్యవసర విచారణకు అంగీకరించిన సుప్రీం కోర్టు.. రేపు విచారణ

Rohit Ranjan: జీ న్యూస్ (G News) యాంకర్, జర్నలిస్ట్ (Journalist) రోహిత్ రంజన్ (Rohit Ranjan) దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు (supreme Court) అంగీకరించింది. రోహిత్ రంజన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా పిటిషన్ దాఖలు చేశారు. తన క్లైయింట్ రోహిత్ రంజన్ ను ఇప్పటికే నోయిడా పోలీసులు అరెస్టు చేశారనీ, ఆ తర్వాత బెయిల్ పై విడుదల చేశారన్నారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేయాలని చూస్తున్నారని పిటిషన్ లో పేర్కొంటూ అత్యవసర విచారణగా స్వీకరించాలని కోరారు. పిటిషన్ పై రేపు ( బుధవారం) విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

SC agrees to hear tomorrow journalist Rohit Ranjan's plea
SC agrees to hear tomorrow journalist Rohit Ranjans plea

 

రోహిత్ రంజన్ ను అరెస్టు చేసేందుకు మంగళవారం ఘజియాబాద్ లోని అయన నివాసం వద్దకు చత్తీస్‌గఢ్ పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో ఘజియాబాద్ పోలీసులు జోక్యం చేసుకుని రంజన్ ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఆ తరువాత 12 గంటల పాటు విచారణ చేసిన తరువాత మంగళవారం అర్ధరాత్రి ఆయనను వదిలిపెట్టారు. చత్తీస్‌ఘడ్ పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రోహిత్ రంజన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

 

విషయం ఏమిటంటే.. రోహిత్ రంజన్ జీ టీవీ ఛానల్ నందు పేరుగాంచిన డీఎన్ఏ షోకి వ్యాఖ్యతగా చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి సంబంధించి ఓ వీడియోను తప్పుగా అందించారు. ఆ తర్వాత ఛానల్ వెంటనే సరి చేసుకుని క్షమాపణలు చెప్పింది. అయితే ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఏమి మాట్లాడారు అంటే.. రాహుల్ గాంధీ తన వాయినార్ కార్యాలయంపై దాడిని ప్రస్తావిస్తూ …”ఇలా చేసిన యువకులు చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. అయినా వారు చిన్న పిల్లలు క్షమించండి” అని అన్నారు. అయితే జీ ఛానల్ లో ఉదయ్ పూర్ కన్హయ్య లాల్ ను చంపిన ఘటనతో లింక్ చేస్తూ .. వారు చిన్న పిల్లలని వారిని క్షమించాలంటూ చెబుతున్నట్లుగా ఉంది. మార్ఫింగ్ వీడియో ప్రసారం చేయడంపై రోహిత్ రంజన్ పై చత్తీస్‌గఢ్, రాజస్థాన్ లలో కేసులు నమోదు అయ్యాయి.

 

మరో పక్క చత్తీస్‌ఘడ్ పోలీసులు స్థానిక పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఘజియాబాద్ లోని తన నివాసం వద్దకు రావడాన్ని తప్పుబట్టారు రోహిత్ రంజన్. నిన్న తన నివాసం వద్దకు చత్తీస్ ఘడ్ పోలీసులు వచ్చిన సందర్భంలో ట్విట్టర్ లో స్పందిస్తూ.. నా ఇంటికి చత్తీస్‌గఢ్ పోలీసులు వచ్చారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే నన్ను అరెస్టు చేయడానికి వచ్చారు. చట్టపరంగా ఇది సరైనదేనా.. అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ పై స్పందించిన ఘజియాబాద్ పోలీసులు.. ఇది పోలీసుల దృష్టిలో ఉందని, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని బదులు ఇచ్చారు. ఆ తరువాతనే చత్తీస్‌గడ్ ఫోలీసులు అతన్ని అరెస్టు చేయకుండా ఘజియాబాద్ పోలీసులు తమ వెంట తీసుకువెళ్లారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!