ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ కేసులో మరో సారి విచారణ జరపాలని బాంబే హైకోర్టును బుధవారం ఆదేశించింది. ఈ మేరకు నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ప్రొఫెసర్ సాయిబాబాను బొంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. హైకోర్టు తీర్పును ఎన్ఐఏ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, అప్పీల్ ను విచారించిన సుప్రీం కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. గతంలో నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు ఇప్పటికే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నందున సముచిత ప్రయోజనాల దృష్ట్యా మరో బెంచ్ అన్ని కోణాల్లో ఒకే విధంగా విచారణ జరపాలని సుప్రీం కోర్టు పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 15న చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) కింద .. సాయిబాబా ఇతరులపై ప్రాసిక్యూషన్ చెల్లుబాటు కాదని బాంబే హైకోర్టు కొట్టేసి వాళ్లను తక్షణమే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు స్పందిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ప్రకారం దోషులుగా నిర్దారించిన వారి నేరాల తీవ్రతను బాంబే హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా హైకోర్టు అభ్యంతరకరమైన తీర్పు ఇచ్చిందని, దీనిపై సమగ్ర పరిశీలన అవసరమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
అచ్చెన్నకు పోటీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్