మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. కేసు దర్యాప్తునకు సుప్రీం కోర్టు డెడ్ లైన్ విధించింది. ఏప్రిల్ 30వ తేదీలోగా విచారణ ముగించాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆరు నెలల్లోగా విచారణ మొదలు కాకపోతే ఈ కేసులో ఏ 5 నిందితుడు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. అయితే సీబీఐ ప్రస్తుత దర్యాప్తు అధికారి రాం సింగ్ ను తొలగించడంతో పాటు డీజీఐ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది సీబీఐ. వివేకా హత్య కేసులో విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

వివేకా హత్య కేసు దర్యాప్తుకు సంబంధించి ఏ 5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవేళ జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఏప్రిల్ 30లోగా పూర్తి చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఏప్రిల్ 30లోగా విచారణను ముగించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. డీఐజీ చౌరాస్య పర్యవేక్షణలో ఎస్పీ వికాస్ కుమార్, అడిషన్ ఎస్పీ ముఖేష్ శర్మ, ఇన్స్ పెక్టర్ లు ఎస్ శ్రీమతి. నవీన్ పునియా, సబ్ ఇన్స్ పెక్టర్ అంకిత్ యూదవ్ లతో సిట్ ఏర్పాటు చేసినట్లు సీబీఐ తెలియజేయగా ధర్మాసనం అంగీకరించింది.
వివేకా హత్య కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యంపై సుప్రీం కోర్టు ఇంతకు ముందు విచారణ సందర్భంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలంటూ సీబీఐకి తెలిపింది. అవసరమైతే ప్రస్తుతం ఉన్న అధికారిని కొనసాగిస్తూనే విచారణ త్వరితగతిన పూర్తి చేసేందుకు మరో అధికారిని నియమించాలని ధర్మాసనం తెలిపింది ఆ రోజు ఆదేశాల మేరకు నేడు రాంసింగ్ కు అదనంగా మరో అధికారిని నియమిస్తూ సీబీఐ నివేదికను ఇచ్చిన క్రమంలో రాం సింగ్ ను కొనసాగించడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త అధికారిని నియమించిన తర్వాత రాంసింగ్ ను కొనసాగించడంలో అర్ధం లేదని అభిప్రాయపడింది. రాంసింగ్ వల్లనే వివేకా హత్య కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సీబీఐ పై ధర్మాసనం మండిపడింది. దీంతో కొత్తగా సిట్ ప్రతిపాదనను సీబీఐ కోర్టు ముందు ఉంచింది.
AP CM YS Jagan: నేడు మరో సారి హస్తినకు పయనం.. ఈ కీలక అంశాలపైనే..?