Big Boss: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా షో బిగ్ బాస్ రియాల్టీ షో. ఇటీవలే ప్రోమో కి సంబంధించి బిగ్ బాస్ లోగో “స్టార్ మా” అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది. చిన్నపాటి వీడియో అదిరిపోయే మ్యూజిక్ తో రిలీజ్ అయిన ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో .. షో ప్రోమో కోసం బిగ్ బాస్ ఆడియన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
హోస్ట్ ఈసారి కూడా నాగార్జున అన్నట్లు టాక్. వరుసగా మూడోసారి నాగార్జున హోస్ట్ గా ఈ షోకి వ్యవహరిస్తున్నట్లు…టాక్. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు త్వరలోనే అనగా ఆగస్టు 15 తారీకు లోపు ప్రోమో రిలీజ్ చేయటానికి షో నిర్వాహకులు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ మాసం నుండి షో స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి హౌస్ లో ఎక్కువగా లేడీస్ డామినేషన్ ఉంటుందని… చాలావరకు ఆడవాళ్ళు మాత్రమే హౌస్ లోకి వచ్చేలా ప్రముఖ యాంకర్ లను హీరోయిన్ లను… అదే రీతిలో సోషల్ మీడియా స్టార్స్ నీ షో నిర్వాహకులు రంగంలోకి దింపుతున్న ట్లు సమాచారం.
గ్లామర్ డోస్ హౌస్ లో ఈ సారి గట్టిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దాదాపు గత సీజన్ మాదిరిగాన్నే 100 రోజులు పాటు నిర్వహించేలా షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ మాసం నుండి స్టార్ట్ చేసి సరిగ్గా డిసెంబర్ కి కంప్లీట్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.