NewsOrbit
Andhra Pradesh Political News న్యూస్ ప్ర‌పంచం

jahnavi kandula: భారత విద్యార్థిని మృతిపై అమెరికన్ అధికారి హేళన.. విచారణకు ఆదేశం

Seattle Police Officer Jokes about jahnavi kandula
Advertisements
Share

jahnavi kandula: వివిధ దేశాలకు చెందిన అనేక మంది విద్య ఉపాధి అవకాశం కోసం అగ్ర దేశం అమెరికాకు వెళుతున్న సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లడం అక్కడ చదవడం, అక్కడ ఉద్యోగాలు చేయడం ఒక స్టేటస్ గా, వైపు అడుగులు వేస్తుంటారు. అరుదైన అవకాశం గా మన వాళ్ళు చెప్పుకొస్తుంటారు. అయితే అక్కడి వాళ్ళు మన వారిని ఎంతో చులకనగా చూస్తారు. అటువంటి సంఘటన ఒకటి తాజాగా అమెరికాలో వెలుగు చూసింది.

Advertisements
Seattle Police Officer Jokes about jahnavi kandula
Seattle Police Officer Jokes about jahnavi kandula

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. అక్కడి నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలోని సీటల్ క్యాంపస్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. దురదృష్ట వసాత్తు ఈ ఏడాది జనవరిలో ఆమె రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందింది.

Advertisements
Seattle Police Officer Jokes about jahnavi kandula
Seattle Police Officer Jokes about jahnavi kandula

అయితే జాహ్నవి కందుల మృతికి సాధారణ రోడ్డు ప్రమాదంగా తొలుత అందరు భావించారు. ఏపీ లో ఉన్న ఆమె తల్లిదండ్రులకు అదే విధంగా సమాచారంఇచ్చారు. అయితే ఈ ఘటన జరిగిన ఎనిమిది నెలల తరువాత కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జాహ్నవి రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఒక పోలీస్ అధికారి జాహ్నవి మృతిని హేళన చేస్తూ మాట్లాడడం వెలుగు చూసింది. దీంతో ఆ రోడ్డు ప్రమాదానికి కారణం పోలీస్ అధికారి కెవిన్ డెవ్ అని వెల్లడి అయింది.

Seattle Police Officer Jokes about jahnavi kandula
Seattle Police Officer Jokes about jahnavi kandula

ఈ ఏడాది జనవరిలో జాహ్నవి కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో జాహ్నవి అక్కడి కక్కడే మృతి చెందింది. అయితే ఆమె మరణానికి పోలీస్ అధికారి కారణంగా తెలుస్తోంది. పైగా సదరు భారత విద్యార్థిని మృతి పై అతను హేళనగా మాట్లాడాడు. అతను మరో అధికారితో మాట్లాడే క్రమంలో..

Seattle Police Officer Jokes about jahnavi kandula
Seattle Police Officer Jokes about jahnavi kandula

ఆమె వయసు 26 సంవత్సరాలనే.. ఆమె ప్రాణాలకు విలువ లేదని నవ్వుతూ వ్యాఖ్యానించాడు. అయితే ఆ సంభాషణ అతడు బాడీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ సంభాషణ బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై విమర్శలు వెళ్లువెత్తడంతో సీటెల్ పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది. ఆ ఘటన బాధ్యుని పై చర్యలు తీసుకునేందు ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

Share
Advertisements

Related posts

Priyanka arul: ప్రియాంక అరుళ్ కి అక్కినేని హీరో రెండు ఛాన్సులు..?

GRK

వివో నుంచి 5జి ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

Srikanth A

AP High Court: ఎస్సీ,ఎస్టీ అట్రసిటీ కేసులో ఎంపీ రఘురామకు ఊరట..

somaraju sharma