NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Nimmagadda – జగన్ పై పోరాటానికి ఢిల్లీ పెద్దలను కలవనున్న నిమ్మగడ్డ..!

Nimmagadda: Last Bomb on AP Govt

Nimmagadda.. జగన్ పై పోరాటానికి ఢిల్లీ పెద్దలను కలవనున్నారా..? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడీ వార్తే హాట్ టాపిక్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అసలు ఈ నిర్ణయం తీసుకున్నారా..? ఆయన అడుగులు ఏంటి..? ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి..? సీఎం జగన్ కు ఎటాక్ ఇస్తూనే ఆయన తండ్రి దివంగత వైఎస్ ను పొగడటం ఏంటి..? ప్రభుత్వంపై ఆయన పోరాటం ఏంటి..? ఆయనకు ఉన్న విశేష అధికారాలను ఎలా ఉపయోగించబోతున్నారు..? జగన్ ను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తారా..? ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల్లో ఆయన తీసుకోబోయే నిర్ణయాలేంటి..? ఇలా ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు.. ఇంకెన్నో ఊహాజనితాలు.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నాయి. తనకు సహకరించని అధికారులపై చర్యలు తీసుకోవడం కోసం వ్యూహాత్మకంగా వెళ్లబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఎస్ఈసీ చర్యలను నిశితంగా పరిశీలిస్తోందని సమాచారం.

బ్రేకుల్లేని ఎస్ఈసీ స్పీడు..

పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ హోదాలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. దీనికి డీజీపీ సవాంగ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ ద్వివేది హాజరు కాలేదు. వీరిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాశారు. అయితే.. వీరిపై సీఎస్ ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఎస్ఈసీ సుప్రీం.. ఆయన ఆదేశాలే శాసనం. అయినా.. ప్రభుత్వం తన ఆదేశాలు పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే.. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్ఈసీ ఇప్పుడు ఈవిషయంలో ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితిని వివరించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఏకంగా కేంద్ర బలగాలను రప్పించే ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తోంది.

sec nimmagadda to meet amith shah
sec nimmagadda to meet amith shah

Nimmagadda ఎస్ఈసీ దూకుడుకు కళ్లెం వేయాలని ప్రభుత్వం..

రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్ఈసీ కదలికలు, నిర్ణయాలను సునిశితంగా పరిశీలిస్తోంది. నామాట కాదని లక్షణరేఖ దాటారంటూ.. ఎస్ఈసీ మండిపడుతుంటే.. మీరే లక్షణరేఖ దాటారని మంత్రులు ఆయనపై మండిపడుతున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ వెళ్లి భంగపడ్డ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవడం వరకూ ఓకే. కానీ.. మళ్లీ ఎస్ఈసీని నిందించడం, విమర్శించడం అనవరమైన చర్యగా చెప్పాలి. 40ఏళ్ల అనుభవం ఉండి కూడా పంచాయతీ ఎన్నికలకు పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయడం చంద్రబాబు తప్పిదం. ఆయనపై చర్యలు తీసుకుంటారా? అన్న మంత్రుల ప్రశ్నలకు ఎస్ఈసీ స్పందించి.. రెండు రోజుల్లో దీనిపై సమాధానం ఇవ్వాలంటూ టీడీపీకి నోటీసులు ఇచ్చారు. ఇలా తన వైపు తప్పు కనబడకుండా ఉండేలా ఎస్ఈసీ ముందుకు వెళ్తున్నారు. మరోవైపు అధికారుల సర్వీసు రికార్డులపై కూడా కన్నేసిన ఎస్ఈసీ ఆదేశాలకు భయపడొద్దని ప్రభుత్వం అధికారులకు భరోసా ఇస్తోంది. దీనిపై కేంద్రానికి కూడా లేఖలు రాస్తూ.. అధికారుల్లో నమ్మకం కలిగిస్తోంది.

sec nimmagadda to meet amith shah
sec nimmagadda to meet amith shah

నిమ్మగడ్డ వాళ్లని రప్పిస్తారా..? Nimmagadda

ప్రభుత్వం కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డపై కౌంటర్ అటాక్ చేస్తోంది. ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చి స్పీకర్ కార్యాలయంలో ఇచ్చారు. మరోవైపు ఎస్ఈసీ తీరుపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్దమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఉన్నాతాధికారులపై చర్యలు, ఎన్నికల ప్రాంతాల్లో పర్యటించే ప్రజాప్రతినిధులకు వాహనాలు నిలుపుదల, వారితో అధికారులు వెళ్లకూడదనే నిబంధన, ప్రభుత్వ సలహాదారుడు సజ్జలపై ఎన్నికల కోడ్.. వంటి విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల తనపై చేసిన వ్యాఖ్యలపై ఎస్ఈసీ కోర్టుకు వెళ్లారు. సోమవారం హైకోర్టులో ఈ అంశం విచారణకు రానుంది. ఇప్పటికే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలా ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎస్ఈసీ కూడా ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ గ్రామాలకు ఇచ్చే మొత్తాలను పెంచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమా, రాజ్యాంగ వ్యవస్థా.. అనే రీతిలో పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులోకి నిజంగానే నిమ్మగడ్డ కేంద్ర బలగాలను రప్పిస్తే పరిస్థితులు మరో టర్న్ తీసుకుంటాయనడంలో అతిశయోక్తి లేదు.

 

author avatar
Muraliak

Related posts

YS Jagan: అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N