NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: టీడీపీ సెకండ్ లిస్ట్ ఫైనల్ చేసిన చంద్రబాబు .. జాబితా విడుదల ఎప్పుడంటే..?

TDP: టీడీపీ వచ్చే ఎన్నికల కోసం వేగంగా అడుగులు ముందుకు వేస్తొంది. ఇప్పటికే జనసేన, బీజేపీతో పొత్తులు ఖరారు, సీట్ల సర్దుబాటు చేసుకున్న చంద్రబాబు మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. బీజేపీతో పొత్తు ఖరారు కాకముందే జనసేనతో కలిపి 99 మందితో ఉమ్మడిగా తొలి జాబితా ప్రకటించారు. వీటిలో 94 స్థానాలకు టీడీపీ అభ్యర్ధులను ప్రకటించగా, అయిదు స్థానాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

తొలి జాబితా ప్రకటన తర్వాత పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతల నుండి అసంతృప్తి వ్యక్తం కాగా, తొలి జాబితాలో సీట్లు దక్కని ఆశావహులు, సీనియర్ లను పిలిపించి మాట్లాడి నచ్చజెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అనేక విధాలుగా సర్వేలు చేసి అభ్యర్ధులను ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చారు చంద్రబాబు. సీట్లు దక్కని నేతలకు అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా సముచిత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు.

ఆ తర్వాత టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీలో చేరికతో 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, 21 స్థానాల్లో జనసేన, 10 స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. అలానే లోక్ సభ స్థానాల విషయానికి వస్తే టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేసే విధంగా సీట్ల సర్దుబాటు జరిగింది. పొత్తు సీట్లు పోను 144 స్థానాల్లో ఇప్పటికే 94 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా, ఇంకా 50 నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.

ఈ క్రమంలో రెండో జాబితాను గురువారం టీడీపీ ప్రకటించనుంది. ఈ విషయాని చంద్రబాబే స్వయంగా బుధవారం వెల్లడించారు. గురువారం టీడీపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు. కసరత్తు తుది దశకు చేరుకుందని, వీలైనంత మంది అభ్యర్ధులను రెండో జాబితాలో ప్రకటిస్తామని వెల్లడించారు. జనసేన, బీజేపీ ఏయే స్థానాల్లో పోటీ చేసేది వారికి స్పష్టత ఉందని, సమయానుకూలంగా ఆ పార్టీలు వారి అభ్యర్ధులను ప్రకటిస్తాయని చెప్పారు.

అయితే ఈ నెల 14న చంద్రబాబు 25 నుండి 30 అసెంబ్లీ స్థానాలకు, పలు లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. ఈ నెల 17న చిలకలూరిపేటలో కూటమి పార్టీల బహిరంగ సభకు ప్రధాని మోడీ హజరు అవుతుండటంతో ఈ లోపుగానే సాధ్యమైనంత వరకు అభ్యర్ధులను ప్రకటించేలా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు.

మొదటి జాబితాలో పలువురు సీనియర్ నేతల నియోజకవర్గాలను ప్రకటించలేదు. దీంతో రెండో జాబితాలో ఎవరికి సీటు దక్కుంతుందో, ఎవరికి సీటు దక్కదు అనేది ఉత్కంఠ గా మారింది. అధికార వైసీపీ నుండి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీ గూటికి చేరిన నేపథ్యంలో వారిలో ఎందరికి అవకాశం ఇస్తారు అనేది కూడా వేచి చూడాలి.

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల తుది జాబితా ప్రకటనకు మూహూర్తం ఖరారు..ఎప్పుడంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N