NewsOrbit
న్యూస్ హెల్త్

గూగుల్ ఇలా ఎలా చేయగలుగుతుంది అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా???

గూగుల్ ఇలా ఎలా చేయగలుగుతుంది అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా???

గూగుల్, ప్రపంచంలో ఏ విషయం గురించి అయినా క్షణాల్లో సమాధానం చెప్పే సామర్ధ్యం ఉన్న సాధనం. మన నిజజీవితంలో గూగుల్ మనకి ఎన్నో సేవలను అందిస్తోంది. గూగుల్ మీద చాలా సాఫ్ట్‌వేర్ పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. గూగుల్ లేకపోతే హైటెక్ ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది. కానీ మార్కెటింగ్ ప్రకారం ఆలోచిస్తే గూగుల్ చేసే ప్రతిదానిలో గెయిన్ స్ట్రాటెజీని ఫాలో అవుతుంది. ఇది అందరికీ తెలిసినదే.

గూగుల్ ఇలా ఎలా చేయగలుగుతుంది అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా???

ఆన్‌లైన్‌లో మనం ఏ వస్తువుల కోసం సెర్చ్ చేస్తున్నామో గూగుల్ ట్రాక్ చేసి, వాటినే యాడ్స్ రూపంలో మన స్క్రీన్ మీద కనిపించేలాగా చేస్తుంది… ఇది కూడా మనకి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ మాత్రమే కాకుండా ఆఫ్‌లైన్ షాపింగ్‌పై కూడా జైపూగ్లే దృష్టి పెట్టింది.

ఉదాహరణకు ఒక వ్యక్తి తన దగ్గరలోని సూపర్ మార్కెట్ కు వెళ్లి కొన్ని వస్తువులను  కొని తన డెబిట్ కార్డు తో బిల్ పే చేసి  ఇంటికి తిరిగి  వచ్చాక అతని ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేస్తే అతను కొన్న వస్తువులే యాడ్స్ రూపంలో కనిపిస్తాయి. ఇది మనందరం చేసే పనే కానీ ఇది మనం అస్సలు పట్టించుకోము. అయితే మనం ఏం కొంటున్నదీ, ఏ వస్తువులను కొనాలి అనుకుంటున్న విషయం గూగుల్‌కి ఎలా తెలుస్తున్నాయి? ఈ కోణంలో ‘బ్లూంబర్గ్’ ఓ సీక్రెట్ ఆపరేషన్ చేసింది. ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదే మాస్టర్ కార్డ్‌తో, గూగుల్ కు ఉన్న  సీక్రెట్ పార్టనర్‌షిప్.

ఇప్పటి వరకు గూగుల్ రూపొందించిన ప్రత్యేక ఆల్‌గారిథమ్‌ వలన మనం సెర్చ చేసే విషయాలను ట్రాక్ చేసేది. వాటికి సంబంధించిన యాడ్స్ మన స్క్రీన్ మీద ప్రత్యేక్షమయ్యేలా గూగుల్ చేసేది. ఇప్పుడు ఆఫ్‌లైన్ కొనుగోళ్లను కూడా వదిలిపెట్టకూడదని గూగుల్ పక్కాగా డిసైడ్ అయ్యింది. అందుకే ఆఫ్‌లైన్ కొనుగోళ్లకు ఉపయోగించే మాస్టర్‌కార్డ్‌తో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకుంది. సంవత్సరం క్రితం జరిగిన ఈ సీక్రెట్ అగ్రిమెంట్ కారణంగా మాస్టర్‌కార్డ్ ఉపయోగించి, మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు గురించి సమాచారం క్షణాల్లో గూగుల్‌కి అందుతోంది. ఈ సమాచారాన్ని గూగుల్ యాడ్స్ గా  క్రియేట్ చేసి మన ఫోన్స్  లో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక్షం అయ్యేలా చేస్తోంది. ఈ సీక్రెట్ ఆపరేషను ‘బ్లూంబర్గ్’ అనే ఒక ఫైనాన్సియల్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కంపెనీ జరిపింది.

‘బ్లూంబర్గ్’ చేసిన సీక్రెట్ ఆపరేషన్ వెల్లడించిన విషయాలు నిజమేనని గూగుల్ కూడా  ఒప్పుకుంది  ‘‘మాకు యాడ్స్ ఇచ్చే కంపెనీ ప్రొడక్ట్స్  గురించి మేం ప్రతీ విషయం సేకరిస్తాం. వారికి ఆన్‌లైన్‌లో ఉన్న డిమాండ్ తో పాటు, ఆఫ్‌లైన్‌లో ఉన్న క్రేజ్ గురించి కూడా వారికి  తెలిపేందుకే మేము మాస్టర్‌కార్డ్‌తో ఒప్పందం చేసుకున్నాం…’ అని మీడియాకు గూగుల్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఆఫ్‌లైన్ షాపింగ్ వివరాలను సైతం సేకరిస్తున్న విషయం వాస్తవమేనని ఒప్పుకున్న గూగుల్, వినియోగదారుల యొక్క వ్యక్తిగత భద్రతకు ఎటువంటి భంగం వాటిల్లకూడదు అని  డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది.

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju