సాధారణంగా వాహన ప్రియులు లగ్జరీ కార్లు కొనాలని కలలు కంటూ ఉంటారు..! కానీ ఎక్కువ ధర కారణంగా వారి కల ఒక కలగా మిగిలిపోయింది.. మనదేశంలో లగ్జరీ కార్ల అమ్మకాలు , రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి..! ఎఫ్ఏడిఏ విడుదల చేసిన డేటా ప్రకారం నవంబర్ 2019- 2020నవంబర్ తో పోల్చుకుంటే దేశంలో లగ్జరీ అమ్మకాలు భారీగా తగ్గాయి..
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఎఫ్ఏడిఏ డేటా ప్రకారం, నవంబర్ 2020లో టాప్ 10 లగ్జరీ కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. తరవాత స్థానాల్లో బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవ్, వోల్వో, పోర్ష్, లాంబోర్గినీ, ఫెరారీ, రోల్స్ రాయిస్ ,బెంట్లీ బ్రాండ్లు ఉన్నాయి.
బ్రాండ్ వారీగా అమ్మకాల వివరాలు..
1. నవంబర్ 2020లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశీయ విపణిలో 897 లగ్జరీ కార్లను విక్రయించింది. అయితే నవంబర్ 2019లో 1,223 యునిట్లు అమ్ముడయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే కంపెనీ గత నెలలో 27% క్షిణించింది.
2. రెండవ అతిపెద్ద సంస్థగా బిఎమ్‌డబ్ల్యూ ఇండియా గత నెలలో మొత్తం 728 బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్లు అమ్ముడుపోగా, నవంబర్ 2019లో వీటి సంఖ్య 954 యునిట్లుగా ఉండగా కంపెనీ గత నెలలో 24% క్షీణతను నమోదు చేసింది.
3. జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి. నవంబర్ 2019లో ఆడి మొత్తం 260 లగ్జరీ కార్లను విక్రయించగా, నవంబర్ 2020లో 236 కార్లను విక్రయించి 9 శాతం తగ్గుదలను నమోదు చేసి మూడవ స్థానంలో ఉంది.
4. జాగ్వార్ ల్యాండ్ రోవర్ నవంబర్ 2020లో జెఎల్ఆర్ మొత్తం 199 కార్లను విక్రయించగా, గత ఏడాది కంపెనీ అమ్మకాలు 317 యూనిట్లు ఉండగా, జెఎల్ఆర్ 37% క్షిణించి నాల్గవస్థానంలో ఉంది.
5. ఐదవ స్థానంలో ఉన్నది స్వీడన్‌కి చెందిన లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో. వోల్వో ఇండియా గడచిన నవంబర్ 2020లో మొత్తం 169 కార్లను విక్రయించింది. నవంబర్ 2019లో ఇవి 196 యూనిట్లుగా నమోదయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే కంపెనీ అమ్మకాలు 14% క్షీణించాయి.
6. ఆరవ స్థానంలో ఉన్న పోర్ష్ లగ్జరీ బ్రాండ్ నవంబర్ 2020లో 27 యూనిట్లను విక్రయించి 18% క్షిణించింది.
7. ఇకపోతే, లాంబోర్గినీ సూపర్ కార్ బ్రాండ్ గడచిన నవంబర్ నెలలో అనూహ్యంగా 300 శాతం వృద్ధి అయ్యింది. గత నెలలో కంపెనీ మొత్తం 4 సూపర్ కార్లను విక్రయించింది. నవంబర్ 2019లో కంపెనీ కేవలం 1 కారును మాత్రమే విక్రయించింది.
8. ఆ తర్వాత ఫెరారీ కంపెనీ నవంబర్ 2020 నెలలో ఒక కారు విక్రయించి 66% క్షిణించింది.
9. రోల్స్ రాయిస్ కంపెనీ నవంబర్ 2020 నెలలో ఒక కారు విక్రయించి 75% క్షీణత.
10.ఈ జాబితాలో చివరి బ్రాండ్ అయిన బెంట్లీ గడచిన నెలలో ఒక్క కారును కూడా విక్రయించలేదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?