Weight Loss: ఫూల్ మఖన తో వెయిట్ లాస్ ఎలాగో చూడండి!!

Share

Weight Loss: ఈ రోజుల్లో  70 శాతం మంది ఒబిసిటీ బారిన పడుతున్నారు అంటే దానికి గల కారణం సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడమే  అని నిపుణులు  తెలియచేస్తున్నారు. బరువు  తగ్గాలన్న ,ఆరోగ్యంగా   కావాలన్నా మనం తీసుకునే కేలరీలు  చాలా ముఖ్యమైనవి. అయితే మఖాన  తీసుకోవడం వల్ల బరువు తగ్గడం తో పాటు ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది అని నిపుణులు  తెలియచేస్తున్నారు.  ఇందులో   ఉండే ప్రోటీన్ బరువు తగ్గడానికి  బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా మఖాన లో ఫైబర్  ఎక్కువగా లభిస్తుంది.  అందుకే  మఖానా  తిన్నప్పుడు  ఎక్కువ సేపు ఆకలి  లేనట్ట అనిపిస్తుంది. దీనితో  మళ్ళి ఏదైనా తినాలి అనే కోరిక పుట్టదు.  మఖానా  తినడం వలన ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం..
మఖానా లో  ప్రోటీన్లు, ఫైబర్ తో పాటు ఐరన్,  కాల్షియం, ఫాస్పరస్  పుష్కలంగా ఉంటాయి . ఇది అనేక రకాల  అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి .

మఖానా లో మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వలన  ఇది నర్వ్ ఫంక్షన్ ని  ప్రభావితం చేస్తుంది.
మఖానా లో  యాంటీ ఆక్సిడెంట్స్  గుండె సంబంధిత సమస్యలు రాకుండా  చేస్తాయి.   డయాబెటిస్ ,క్యాన్సర్ సమస్యలు కూడా ఉండవు. బ్లడ్ షుగర్  స్థాయి  అదుపు చేయడానికి  కూడా  ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
చర్మం అందంగా పింపుల్స్, ముడతలు వంటివి లేకుండా  చూస్తుంది.

Weight Loss: బరువు  తగ్గించడం లో  మ‌ఖానా  బాగా పనిచేస్తుంది.

వీటిలో కేలరీల శాతం  తక్కువగా  ఉండడం వలన  స్నాక్స్‌గా   తీసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది.
మ‌ఖ‌నాల్లో  ఉండే సాచురేటెడ్ కొవ్వు   శరీరానికి చాలా ఆరోగ్యకరమైనది .
వీటితో అనేక రకాల వంటలు చేసుకొని తినవచ్చు.తామర గింజలను పచ్చిగానే  వాడుకోవచ్చు.  లేదంటే  వేయించి లేదా ఉడకబెట్టి సూప్స్‌, సలాడ్లు, వివిధ కూరల్లో వాడుకోవచ్చు . ఎక్కువమంది వీటిని కాల్చుకుని స్నాక్స్‌గా తీసుకోవడానికి  ఇష్టపడతారు. అయితే వీటిని వేయించి తీసుకోవడం కన్నా  పచ్చిగా లేదా ఉడకబెట్టి తినడం వలన    ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు  కలుగుతాయి. అయితే గ్యాస్ట్రిక్‌ సమస్యలు,కడుపు ఉబ్బరం ,అలర్జీలు, సమస్యలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండటం  మంచిది.


Share

Related posts

చంద్రబాబు, లోకేష్ లపై అదిరిపోయే మాస్ డైలాగ్స్ వేసిన కొడాలి నాని..!!

sekhar

అతనిని నమ్ముకునే వారితో పోటీ పడుతున్న స్టార్ మా..! ఈవెంట్ హిట్టేనా…?

arun kanna

Cradle Ceremony: నయా ట్రెండ్ ఇదీ..! మొన్న కర్నూలులో శునకానికి బర్త్ డే..! నిన్న బందరులో లేగ దూడకు బారసాల వేడుక..!!

somaraju sharma