టాలీవుడ్ అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ఈ మధ్య జరిగిన తన పెళ్ళి వేడుక తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఒక సంచలనం సృష్టించింది. మొత్తానికి లేటు వయసులోనే పెళ్లి చేసుకున్న కాజల్ చాలా గ్రాండ్ గా తన వివాహ మహోత్సవం ని జరుపుకుంది. ఎన్నో రూమర్లకు చెక్ పెట్టే విధంగా ఈ బ్యూటీ తనకు ఇష్టమైన వారి చేత మూడు ముళ్ళు వేయించుకుంది. ఇక ఇలాంటి అగ్రహీరోయిన్ ను పెళ్లి చేసుకున్న గౌతమ్ కు ఆ పేరు తన బిజినెస్ కు కూడా హెల్ప్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే గౌతం కాజల్ ను తన బిజినెస్ ఉపయోగించుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం.
మొత్తానికి పెళ్లి అయిన తర్వాత కాజల్ సినిమాలపై కూడా శ్రద్ద చూపిస్తుంది. ముందే తన పెళ్లి తర్వాత హీరోయిన్ గా కొనసాగుతున్న క్లారిటీ ఇచ్చేసింది. గౌతమ్ కు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. వీరిద్దరూ హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్లి బాగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం గౌతమ్ కాజల్ కు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ లో అగ్ర వ్యాపారవేత్తగా ఉన్న గౌతమ్ తన కంపెనీకి కాజల్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వైరల్ కాకముందే కాజల్ కూడా వీటిపై ఒక క్లారిటీ ఇచ్చేసింది. కమింగ్ సూన్ ఒక స్టైల్ వీడియో సోషల్ మీడియాలో వదిలింది.
గౌతమ్ కోసం కాజల్ ఈ కామర్స్ సంస్థ డిస్కర్స్ లివింగ్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా మారనుంది. యాడ్స్ ద్వారా భారీ రెమ్యునరేషన్ అందుకున్న కాజల్ తన భర్త బిజినెస్ కోసం రెమ్యునరేషన్ తీసుకోదని స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి కాజల్ ను గౌతమ్ ఎలా వాడుకుంటాడో చూడాలి.