Sekhar Master : శేఖర్ మాస్టర్ గురించి తెలుసు కదా. తెలుగులోనే ఆయన టాప్ కొరియోగ్రాఫర్. మెగాస్టార్ చిరుతో కూడా చిందులు వేయించిన వ్యక్తి ఈయన. తెలుగులో ఉన్న అందరు స్టార్ హీరోలతో డ్యాన్స్ వేయించిన ఘనత శేఖర్ మాస్టర్ ది. అందుకే.. ప్రతి హీరో శేఖర్ మాస్టర్ ను వాళ్ల సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ ను తీసుకోవాలనుకుంటారు. ఓవైపు కొరియోగ్రాఫర్ గా పనిచేయడంతో పాటు… మరోవైపు పలు టీవీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు శేఖర్ మాస్టర్.

స్టార్ మాలో కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లోనూ శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. అప్పుడప్పుడు జబర్దస్త్ లోనూ జడ్జిగా వ్యవహరిస్తుంటాడు శేఖర్ మాస్టర్. ఆయనంటే ఇష్టం లేనివాళ్లు ఎవ్వరూ ఉండరు.
ఎంత ఎదిగినా… ఒదిగి ఉండే తత్వం శేఖర్ మాస్టర్ ది. తన అభిమానులతో మరింత టచ్ లో ఉండేందుకు శేఖర్ మాస్టర్ సొంత యూట్యూబ్ చానెల్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు.
Sekhar Master : దుబాయ్ లో ఫుల్ టు ఎంజాయ్ చేసిన శేఖర్ మాస్టర్
దుబాయ్ కి సినిమా షూటింగ్ కోసం వెళ్లిన శేఖర్ మాస్టర్.. షూటింగ్ విరామ సమయంలో దుబాయ్ మొత్తం చుట్టేశాడు. మిరాకిల్ గార్డెన్ కు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేశాడు. తర్వాత ఎడారికి వెళ్లి అక్కడ కొన్ని స్టంట్స్ చేశాడు. మాల్ కు వెళ్లి షాపింగ్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశాడు శేఖర్ మాస్టర్. ఇంకెందుకు ఆలస్యం…. శేఖర్ మాస్టర్ దుబాయ్ వీడియోను చూసేయండి మరి.