Anchor Lasya : యాంకర్ లాస్య తెలుసు కదా.. బిగ్ బాస్ తర్వాత తన రేంజే మారిపోయింది. ఇప్పుడు తను పెద్ద సెలబ్రిటీ. తనకంటూ ఓ యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. యూట్యూబ్ చానెల్ లో బిజీబిజీగా గడిపేస్తూనే మరోవైపు పలు టీవీ షోలలో పార్టిసిపేట్ చేస్తోంది. ముఖ్యంగా స్టార్ మా చానెల్ లో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ యాంకర్ లాస్య మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది.

ఇటీవల ఉగాది రోజు స్టార్ మాలో ప్రసారం అయిన ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్ లోనూ యాంకర్ లాస్య యాంకర్ గా వ్యవహరించింది. ఒకప్పటి తన ఫ్రెండ్ యాంకర్ రవితో కలిసి ఆ ప్రోగ్రామ్ లో కోయాంకర్ గా చేసింది లాస్య. అలాగే.. స్టార్ మాలో ప్రసారం అయ్యే కామెడీ స్టార్స్ అనే కామెడీ ప్రోగ్రామ్ లోనూ యాంకర్ లాస్య అప్పుడప్పుడు మెరుస్తోంది.
Anchor Lasya : అతిలోకసుందరిలా గెటప్ వేసిన లాస్య
తాజాగా ఓ స్కిట్ లో గెస్ట్ పాత్ర చేసిన లాస్య.. అతిలోకసుందరిగా గెటప్ వేసింది. భూలోకంలో ఉన్న అందగత్తె లాస్యను చూడటం కోసం స్వర్గం నుంచి దిగివచ్చాను అంటూ కటింగ్ ఇచ్చేసరికి.. లాస్యకు అంత సీన్ ఉందా? లాస్యను చూడటానికి ఇంత దూరం వచ్చావా? అంటూ శేఖర్ మాస్టర్ తుస్సున గాలి తీసేశాడు. ఈ ఆదివారం ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది… మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.