న్యూస్

యురేనియం తవ్వకాలపై ఏం చేద్దాం!

Share

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు భేటీ అయ్యారు. హైదరాబాదు జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం పవన్ కళ్యాణ్‌తో హనుమంతరావు సమావేశమయ్యారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయదలిచిన నేపథ్యంలో వీహెచ్ జనసేనాని పవన్ తో చర్చించారు. శ్రీశైలం, నల్లమల అటవీ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు పర్యావరణాన్ని, పులుల సంరక్షణకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఈ సందర్భంగా పవన్ అన్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాల పర్యవసానాలపై మేధావుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకుంటామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. దీనిపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని, రెండుమూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.


Share

Related posts

ఆ మాజీ విషయంలో తండ్రీ కొడుకులు తగాదా పడ్డారట ! ఏమిటా కథాకమామిషు

Yandamuri

ఐఓసీఎల్ అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది..

bharani jella

Corona Death: కరోనాతో విశాఖలో కార్పోరేటర్ మృతి

somaraju sharma

Leave a Comment