NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

” విజయ్ సాయి రెడ్డి జైలు కే ” ఈ మాట అన్నది ఎవరో కాదు !

vijayasai reddy cast based comments purandheswari

వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ విజయసాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలి‌సిందే. త‌న‌దైన శైలిలో ట్వీట్లు చేసే విజ‌య‌సాయిరెడ్డి అదే ఒర‌వ‌డిలో బీజేపీ నేత‌, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురంధీశ్వ‌రి గురించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. vijayasai reddy cast based comments purandheswari

ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైందంటూ విమర్శించారు. అయితే, ఈ కామెంట్లు వివాదంగా మారుతున్నాయి.

విజ‌య‌సాయిరెడ్డి ఏమ‌న్నారంటే….

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయం బయట విలేకర్లతో విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వ్యవస్థల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా పరిమితులు విధించారని చెప్పారు. అయితే కొంతమంది ఆ పరిమితులను అతిక్రమించి స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని వాపోయారు. వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని తెలియజేశారు. బీజేపీ నేత పురంధీశ్వరిని టార్గెట్ చేశారు. పురందేశ్వరి ఈరోజు ఒక పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరావతి రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైందంటూ విజయసాయి విమర్శించారు.

అయ్య‌న్న మండిప‌డ్డారు

విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు, కామెంట్ల‌పై అయ్య‌న్న‌పాత్రుడు భ‌గ్గుమ‌న్నారు. విజయసాయికి పురందేశ్వరిని విమర్శించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ఒక జైలు పక్షి అని, నందమూరి కుటుంబం అంటే తులసివనం వంటిదని అభివర్ణించారు. విజయసాయిరెడ్డి గంజాయివనంలో గంజాయి మొక్క లాంటి వాడేనని అన్నారు. అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. విశాఖ భూకుంభకోణంపై సిట్ కాదు, దమ్ముంటే సీబీఐ దర్యాప్తు వేయండి అంటూ సవాల్ విసిరారు. ఈ కుంభకోణంలో రాజకీయ పార్టీల నేతలే కాదు, ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారని ఆరోపించారు. అందరి జాతకాలు బయటికి వస్తాయని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

గ‌తంలోనూ ఇలాగే…

ఇదిలా ఉంటే, తన ట్వీట్ల పరంపరతో ప్రత్యర్థులపై వ్యంగ్యాస్థ్రాలు సంధించే విజయసాయిరెడ్డిపై అయ్య‌న్న‌పాత్రుడు సైతం అదే రీతిలో ప‌లు సంద‌ర్భాల్లో విరుచుకుప‌డుతున్నారు. వైసీపీ నేతలకు విశాఖ ప్రజలపై ప్రేమ లేదని… కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఇక్కడి భూమిపై మాత్రమే వారికి ప్రేమ ఉందని అన్నారు. గజపతిరాజులకు చెందిన రూ. 50 వేల కోట్ల విలువైన మాన్సాస్ ట్రస్టుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కన్ను పడిందని ఆరోపించారు. విశాఖలో కబ్జాలు, భూదందాలు ప్రారంభమయ్యాయని అన్నారు. విశాఖను రియలెస్టేట్ దందాకు అడ్డాగా విజయసాయి మార్చుకున్నారని చెప్పారు. భూదందాలో పట్టుబడినవారు తన మనుషులు కాదని విజయసాయి ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే నవ్వొస్తోందని అన్నారు. పట్టుబడకుండా దందా చేస్తున్నవాళ్లు మాత్రమే మీవాళ్లా విజయసాయి అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏకంగా జైలు ప‌క్షి అంటూ విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.

author avatar
sridhar

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju