ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం నోటిఫికేషన్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త సంవత్సరం మొదటి తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు వేర్వేరుగా హైకోర్టులు ఉంటాయి. కాగా రెండు హైకోర్టులకు జడ్జీల కేటాయింపు కూడా పూర్తయ్యింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 16 మంది న్యాయమూర్తులు, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.