సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం ఇదొక పేరు మాత్రమే కాదు. ఓ బ్రాండ్. సుడిగాలి సుధీర్ ఏ షోలో ఉంటే ఆ షో టీఆర్పీలు అదుర్స్. అందుకే సుడిగాలి సుధీర్ కు బుల్లితెర మీద అంత క్రేజ్.
బుల్లితెర మీద వచ్చే అన్ని షోలలో సుధీర్ ఉండాల్సిందే. సుధీర్ తో పాటు రష్మీ కూడా ఉంటే ఇక ఆ షోకు వచ్చే క్రేజే వేరప్పా. ఈటీవీలో దీపావళి సందర్భంగా ప్రసారమయ్యే శ్రీకనకమహాలక్ష్మీ లక్కీ డ్రా స్పెషల్ ప్రోగ్రామ్ లో సుడిగాలి సుధీర్ కూడా మెరిశాడు.
సుధీర్ తో పాటు జబర్దస్త్ నటులంతా ఆ షోకు వచ్చారు. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది. శేఖర్ మాస్టర్, రోజా జడ్జలుగా ఉండగా… సుధీర్ చేసిన సందడి మాత్రం మామూలుగా లేదు.
ఈ షోకు వచ్చావు కదా.. నీకు ఏం కావాలి.. అని శ్రీముఖి.. సీరియల్ నటి సిరిని అడుగుతుంది. దీంతో నాకు విల్లా కావాలి.. విల్లా కావాలి అంటుంది.
వెంటనే అక్కడికి వచ్చిన సుధీర్.. విల్లా ఎందుకు.. మన కోసం టికెట్లు బుక్ చేశా.. అని సుధీర్ అంటాడు. దీంతో.. హే.. నాకు టికెట్లు వద్దు.. గికెట్లు వద్దు.. నాకు విల్లానే కావాలి.. అంటూ సుధీర్ తో అంటుంది సిరి. ఏంటి మాట్లాడుతుంటే ఊరికే విల్లా విల్లా అంటున్నావు.. విల్లాలో ఏం చేస్తారు.. అన్ని గదుల్లో అని సుధీర్ అడగగా… నువ్వేం చేస్తావో అదే చేస్తా.. అంటూ సుధీర్ కు పంచ్ వేసింది సిరి. దీంతో స్టేజి మీద నవ్వులే నవ్వులు. వెంటనే రోజా అందుకొని లేడీ సుధీర్ అంటూ పంచ్ వేసింది.
మొత్తానికి ఈ దీపావళికి తెలుగు ప్రేక్షకులకు ఫుల్లు కామెడీ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ ను అందించబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి..
మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…