NewsOrbit
న్యూస్

మీరు ఆ మినిస్టర్ ని  కంట్రోల్ లో పెట్టాలి .. ఇలా అయితే కష్టం ‘ జగన్ కి సీరియస్ కంప్లయింట్ !

ఏపీలో రాజ‌కీయం రంజుగా సాగుతున్న సంగ‌తి తెలి‌సిందే. ఓ వైపు అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ మ‌రోవైపు రాజ‌కీయ పార్టీల నేత మ‌ధ్య విమ‌ర్శ‌‌లు- ప్ర‌తి విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఇదే స‌మ‌యంలో అధికార వైసీపీలోని ప‌రిణామాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

ముఖ్యంగా రాజ‌ధాని విశాఖ కేంద్రంగా మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస రావు, ప్ర‌స్తుత మంత్రి అవంతి శ్రీ‌నివాస్ మ‌ధ్య జ‌రుగుతున్న ప్ర‌చ్చ‌న్న యుద్ధం అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ అన్న‌ట్లుగా కాకుండా వైసీపీలోని రెండు వ‌ర్గాల మ‌ధ్య అనుకూల ప్ర‌తికూల వ‌ర్గాలుగా మారుతోంద‌నే మాటను రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస రావు వైసీపీలోకి రావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌నే టాక్, ఈనెల‌లోనే ఆయ‌న చేరిక ఉంటుంద‌నే అంచ‌నా అంద‌రికీ తెలిసిందే. దీనిపై టీడీపీ నేత‌ల కంటే వైసీపీ నేత‌లే ఎక్కువ‌గా స్పందించ‌డం ఆస‌క్తికరం. ముఖ్యంగా విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీ‌నివాస్ ఆగ్ర‌హోద‌గ్రుడు అవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గంటా ఎంట్రీని వ్య‌తిరేకిస్తున్న అవంతి ఆయ‌న్ను వీలైనంత డ్యామేజ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. విశాఖ‌లో భూ కుంభకోణానానికి పాల్ప‌డ్డార‌ని, గంటా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన విద్యా శాఖలో సైకిల్ కుంభకోణం జ‌రిగింద‌ని గంటాను వీలైనంత చెడు చేసేందుకు అవంతి శ్రీ‌నివాస్‌ ప్ర‌య‌త్నిస్తున్నారు.

అక్క‌డితో ఆగ‌కుండా గంటా అధికార పార్టీలోనే ఎపుడూ ఉంటారని, ఆయ‌నో ఫిరాయింపు నేతగా అని విరుచుకుప‌డుతున్నారు. వైసీపీలో చేరిక గురించి ప్ర‌స్తావిస్తూ త‌న‌పై కేసుల నుంచి తప్పించుకొవడానికే గంటా అధికార పార్టీలోకి రావాల‌ని చూస్తున్నార‌నే సంచ‌ల‌న కామెంట్లు సైతం అవంతి చేసేశారు. అయితే, ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యే వ‌స్తుంటే స్వాగ‌తించాల్సింది పోయి అవంతి ఎందుకు ఈ రేంజ్‌లో విరుచుకుపడుతున్నార‌నే స‌హ‌జమైన డౌట్‌కు స‌మాధానం విశాఖ జిల్లా రాజ‌కీయాలే. పాలిటిక్స్‌లో గంటా అవంతికి గురువు. రాజ‌కీయాల్లో ప‌ట్టున్న వ్య‌క్తి. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు వైసీపీలోకి వ‌స్తే అవంతి హ‌వా త‌గ్గ‌డం ఖాయం. అది గ్రహించే ఆదిలోనే గంటా రాక‌కు అవంతి బ్రేక్‌లు వేస్తున్నారట‌. అందుకే అవినీతి ప‌రుడు, కేసుల మాఫీ కోసం వ‌స్తున్నాడు అంటూ భ‌గ్గుమంటున్నార‌ట‌ని చ‌ర్చించుకుంటున్నారు.

అయితే, అవంతి కంటే బ‌ల‌మైన గంటా రాక‌కు సీఎం జ‌గ‌న్ ఓకే చెప్తున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. విశాఖ‌లో పార్టీ మ‌రింత బ‌లోపేతం, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబును మాన‌సికంగా దెబ్బ‌తీయ‌డం జ‌గ‌న్ స్కెచ్‌. ఇంత‌టి ప‌క్కా ప్లానింగ్‌తో సీఎం జ‌గ‌న్ ముందుకు సాగుతుంటే, అవంతి అడ్డుప‌డ‌టం అంటే ధిక్కార స్వ‌రం వినిపించ‌డ‌మా అనుకోవాలా అంటూ కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. అదే జ‌రిగితే, దాన్ని జ‌గ‌న్ స‌హిస్తారా? మ‌రో రఘురామ‌కృష్ణంరాజులాగా అవంతి మారిపోతారా? అనేది వేచి చూడాల్సిందే.

author avatar
sridhar

Related posts

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?