YSRCP: పోలీసులకు బెదిరింపుల ఆడియో.. వైసీపీ ఇంచార్జిపై డీజీపీ సీరియస్ నివేదిక..!?

Share

YSRCP: ఈ వ్యవహారం జిల్లా మంత్రి బాలినేని వాసు తోపాటు డీజీపీ వరకు వెళ్లినట్లు సమాచారం.పోలీసుల విషయంలో రామనాథంబాబు వ్యవహార శైలిపట్ల జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కూడా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.ఒక ఎస్ఐ మరో సీఐ పట్ల రామనాథంబాబు వ్యవహరించిన తీరును ఎస్పీనే స్వయంగా తన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి తగిన చర్యలు అవసరమని నివేదించినట్టు భోగట్టా.

 serious report to DGP on YSRCP in-charge ..!?
serious report to DGP on YSRCP in-charge ..!?

అసలేం జరిగిందంటే!

కరోనా కట్టడి కి అమలు చేస్తున్న కర్ఫ్యూ లో భాగంగా అనవసరంగా రోడ్డుపైకి వచ్చే వాహనాలను సీజ్ చేయాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఇచ్చిన ఆదేశాలను జిల్లా వ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు అనుసరిస్తున్నారు.ఇందులో భాగంగా పర్చూరులో కూడా చాలా వాహనాలను సీజ్ చేయటం జరిగింది.ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రామనాథంబాబు పర్చూరు ఎస్సై రమణయ్యకు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో బెదిరించారు.తన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అలా చేస్తున్నానని వారికి చెప్పమని ఎస్సై పదే పదే ప్రాధేయ పడినా రామనాథంబాబు వినకపోగా ఆయన్ని హెచ్చరించే ధోరణిలో మాట్లాడారు.ఈ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అయింది.దీంతో రామనాథం బాబుపై విమర్శలు వెల్లువెత్తాయి.ఇదిలా ఉండగానే ఈసారి ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్ తో రామనాథంబాబు నేరుగానే గొడవ పడ్డారు.రొంపేరుబ డ్రైన్లో పడి మరణించిన పరుచూరు నియోజకవర్గానికి చెందిన ముగ్గురు యువకుల మృతదేహాలకు ఆదివారం చీరాల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతుండగా అక్కడ సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఉండగా మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన రామనాథంబాబు సంయమనం కోల్పోయారు.నువ్వే ఎడిట్ చేసిన ఆ ఆడియో టేపును మీడియాకు విడుదల చేశావంటూ సీఐపై ఆయన చిందులు తొక్కారు.మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదంటూ పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజల ఎదుటే రామనాథంబాబు సీఐని హెచ్చరించారు.దీంతో వివాదం మరింత ముదిరింది.పోలీస్ శాఖ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది

YSRCP:  మంత్రి వాసు కి ఫిర్యాదు!

చీరాల డిఎస్పి శ్రీకాంత్ ,ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్ రామనాథంబాబు వ్యవహారశైలిపై నేరుగా మంత్రి బాలినేని వాసు కు ఫిర్యాదు చేశారు.జరిగిన పరిణామాలన్నింటినీ మంత్రికి వివరించగా ఆయన తను విచారించి చర్యలు తీసుకుంటామని ,అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకు వెళ్తానని వారికి హామీ ఇచ్చారు.మరోవైపు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ రామనాథంబాబు ఉదంతంపై నేరుగా గుంటూరు రేంజి డిఐజి, డీజీపీలకు ఒక రహస్య నివేదిక పంపారని తెలుస్తోంది.ఇక ఏం జరుగుతుందో చూడాలి


Share

Related posts

బాబుకు ఆ క్రెడిట్ లేకుండా చేస్తున్న బుద్ద వెంకన్న!

CMR

Anandaiah Medicine: ఆనందయ్య మెడిసిన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!!

P Sekhar

ఇండియా లో చైనా ని మించిపోతున్న కరోనా కేసులు

Siva Prasad