Samantha: సమంత ఇప్పుడు చాలా దూకుడుగా కొత్త సినిమాలను కమిటవుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఇక సమంతకు టాలీవుడ్లో అవకాశాలు రావని అందరూ అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను తారుమారు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకి సైన్ చేసి ఆశ్చర్యపరచింది. ఇప్పటికే తెలుగులో ప్రముఖ నిర్మాణ డ్రీం వారియర్స్ పిక్చర్స్ బ్యానర్లో ఒక సినిమాను కమిటయింది సమంత. అంతేకాదు శ్రీదేవీ మూవీస్ బ్యానర్లో ఒక సినిమాను కమిటయింది. ఈ రెండు సినిమాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమాను పూర్తి చేసింది. తమిళంలో కథు వాకుల రెండు కాదల్ అనే మల్టీస్టారర్ సినిమాను పూర్తి చేసింది. ఈ రెండు సినిమాలు రిలీజ్‌కి సిద్దమవుతున్నాయి. బాలీవుడ్ సినిమాలు సైన్ చేయడానికి సిద్దంగా ఉంది. ఈ క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప రూపొందుతోంది. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం డిసెంబర్ 17న రాబోతోంది.
Samantha: అన్నపూర్ణ స్టూడియోస్‌లో కోటి రూపాయలతో వేసిన సెట్ వేస్ట్..?
ఈ సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోంది. ఈ సాంగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ భారీ వేశారు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ అయితే సమంత రాలేనని రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చమని చెప్పిందట. సమంతకు ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల ఈ మాట చెప్పిందట. దాంతో మేకర్స్ సమంత మాటకు రెస్పెక్ట్ ఇచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో మళ్ళీ సెట్ రెడి చేస్తున్నారట. నవంబర్ చివరివారం నుంచి ఈ సాంగ్ షూటింగ్ మొదలవబోతోంది. 5 రోజులు సమంత డేట్స్ ఇచ్చింది. అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌లో కోటి రూపాయలతో వేసిన సెట్ వేస్ట్ అయిందని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సింది.