ఫ్యాక్టరీలో విస్ఫోటనం : ఏడుగురు మృతి

81 views

న్యూఢిల్లీ, జనవరి 4: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం అర్థ్రరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌లోని సుదర్శన్‌ పార్క్‌ సమీపంలో  మూడు అంతస్తుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో ఎనిమిది మందిని రెస్క్యూ టీం రక్షించింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతునట్లు డీసీపీ మోనికా భరద్వాజ్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 18 మంది ఫ్యాక్టరీలో ఉన్నట్టు చెప్పారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఫైర్ ఆఫీసర్ అతుల్ అతుల్ గార్గ్ మీడియాకు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ పక్కనే గల  స్క్రాప్ యార్డులో మరో 12 మంది ఉన్నట్లు సమాచారం.