పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్, ఏడుగురు మృతి

పాట్నా, ఫిబ్రవరి3: బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

సీమాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు హజీపూర్‌ వద్ద నేటి తెల్లవారుజామున పట్టాలు తప్పింది.

తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో  ఏడుగురు మృతిచెందారు. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఎస్8, ఎస్‌9, ఎస్‌10, బీ3(ఏసీ), ఒక జనరల్‌ బోగీ సహా మొత్తం తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

బాధితుల సహాయార్థం ఆయా ప్రాంతాల్లో రైల్వేశాఖ హెల్ప్‌ లైన్లు ఏర్పాటు చేసింది.

సోన్పూర్‌ 06158221645, హజీపూర్‌ 06224272230, బరౌనీ 06279232222 నంబర్లను అందుబాటులో ఉంచారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.