NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మనకు తెలియకుండానే మన నెత్తిపై డెబ్బై వేల రూపాయలు అప్పు!ఎలాగంటారా? ఈ మేటర్ చదవండి !!

ఏపీలో ఉంటున్న ఒక్కొక్కరి తలపై 70 వేల రూపాయల అప్పును పెట్టింది జగన్ ప్రభుత్వం. దీన్నే ఆర్థిక భాషలో తలసరి అప్పు అంటారు. జగన్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అప్పుల కుప్ప పెరిగిపోతూనే ఉంది.

ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు ఒక్కొక్కరిపై 13 వేల రూపాయల అప్పును పెట్టింది జగన్ సర్కార్. ఫైనాన్షియల్ ఇయర్ ముగియడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఇప్పటికీ.. రాష్ట్రాన్ని నడిపించడం కోసం అప్పులు తెచ్చుకునే ప్రయత్నాల్లోనే ఉంది జగన్‌ ప్రభుత్వం. నవంబర్‌ నెల వరకు 73 వేల 811 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చింది ప్రభుత్వం. డిసెంబర్‌ను కూడా కలుపుకొంటే.. ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు.. అంటే మరో 4 నెలల పాటు ఇలా అప్పులు చేయాల్సిన పరిస్థితే ఉందంటున్నారు అధికారులు. అంటే.. ఏపీలో ఉంటున్న ఒక్కొక్కరి తలపై అప్పుల భారం మరింత పెరుగుతుందనే అర్థం.

అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్!

అప్పులు చేయడంలో జగన్ ప్రభుత్వం కొత్త రికార్డులు నమోదుచేస్తోందంటూ విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. కేవలం 20 నెలల్లో జగన్ సర్కారు తీసుకొచ్చిన అప్పులు లక్ష కోట్ల రూపాయల పైమాటే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాగ్‌ తేల్చిన లెక్కల ప్రకారం ఇప్పటికే 73వేల కోట్ల రూపాయల వరకు రుణం ఉంది. ఇంకా డిసెంబర్ నెల లెక్కలు తేలాలి. రానున్న మూడు నెలల్లో మరింతగా రుణాలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.అప్పుడే తెల్లారిందా అనేది కామెడీ డైలాగు. జగన్ ప్రభుత్వానికి మాత్రం ఇది రొటీన్‌ డైలాగ్‌ అంటూ విమర్శిస్తోంది టీడీపీ.

ఎక్కడ దొరికితే అక్కడ అప్పు!

రాష్ట్ర ప్రభుత్వం దొరికిన చోటల్లా అప్పులు చేస్తోందని ప్రతిపక్షాలు రోజూ విమర్శిస్తూనే ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌ నుంచి, కేంద్రం నుంచి, ఇతర సంస్థలు, పీఎఫ్‌, చిన్నమొత్తాల పొదుపు, బ్యాంకులు, రుణసంస్థలు.. ఇలా వీలైనన్ని మార్గాల్లో అప్పులు చేస్తోంది జగన్ ప్రభుత్వం.

ఆదాయం పెంచే చర్యలు శూన్యం

రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఆదాయంలో 90 శాతం వరకు అప్పులు తెచ్చుకోవచ్చు. కాని, ప్రభుత్వం మాత్రం ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషించడం లేదని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, కొత్త కంపెనీలు రావడం లేదని, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలేవీ జరగడం లేదని ఇప్పటికే ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఆదాయాన్ని పెంచకపోగా, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju