బాలీవుడ్ లో డ్రగ్స్ కుంభకోణం కుదిపేస్తున్నట్లే కన్నడ ఇండస్ట్రీని కూడా డ్రగ్స్ కుంభకోణం ఊపేస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ తీసుకుంటున్నారు, వారి దగ్గర స్టోర్ చేసుకుంటున్నారు అన్న కారణంతో కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుత కేసు బట్టి చూస్తుంటే వీరు బయటకు రావడం చాలా కష్టంగా కనిపిస్తోంది. వీరిద్దరూ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న విషయం తెల్సిందే.
ఇక అసలు విషయానికొస్తే పోలీసుల విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరి ఫోన్లలో డిలీట్ చేసిన డేటాను రికవర్ చేసే ప్రాసెస్ లో ఒళ్ళు గగుర్పొడిచే ఫోటోలు, వీడియోలు పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. వేరే హీరోయిన్ల న్యూడ్ ఫోటోలు, వీడియోలు వీరిద్దరి ఫోన్లలో ఉన్నాయి. అంతే కాకుండా వీరికి సంబంధించిన కొన్ని సెక్స్ వీడియోలు కూడా వీరి ఫోన్లలో ఉన్నాయి. అవి డిలీట్ చేయగా పోలీసులు తిరిగి సంపాదించారు.
దీంతో ఇప్పుడు కేసు మలుపు తిరుగుతోంది. వారి ఫోటోలు, వీడియోలు వీరి దగ్గరకి ఎలా వచ్చాయి. వాటితో వీళ్ళు ఏం చేద్దామనుకుంటున్నారు అన్న కోణంలో విచారణ సాగనందని కొన్ని మీడియాల్లో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ కొత్త వ్యవహారంతో సంజన, రాగిణి ద్వివేది మరింత ఇరకాటంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. సంజన బుజ్జిగాడు సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది. అయితే అవకాశాలు దక్కించుకోవడంలో మాత్రం విఫలమైంది. ఆ తర్వాత చాలా ఏళ్లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నెగటివ్ ఛాయలున్న సినిమాను చేసింది.
ఇక రాగిణి ద్వివేది న్యాచురల్ స్టార్ నాని నటించిన జెండాపై కపిరాజు సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించింది లేదు. అయితే వీరిద్దరూ కన్నడలో పాపులర్ హీరోయిన్లు. ఇక ఈ డ్రగ్స్ కుంభకోణంలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో, ఎవరు ఇరుక్కుంటారో అన్న విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.