Shahrukh khan: బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ మూవీ ఫిక్స్ అయ్యింది. ఇటీవలె రాజ్ కుమార్… హిరానీ…షారుక్ కి స్టోరీ వినిపించటం అంతా కొత్తగా ఉండటంతో… పాటు కెరియర్ బౌన్స్ బ్యాక్ అయ్యే రీతిలో స్టోరీ ఉండటంతో షారుక్ ఓకే చేయడం జరిగిందట. దీంతో సెప్టెంబర్ మాసం నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు బాలీవుడ్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.
దీంతో ఇందులో షారుక్ సరసన హీరోయిన్ గా తాప్సీ ని తీసుకోవాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఇటీవల సరికొత్త పాత్రలు చేస్తూ తన లో నటన విభిన్నంగా పలికిస్తూ ఆడియన్స్ని ఎంతగానో తాప్సి ఆకట్టుకుంటూ ఉండటంతో.. కథానాయక సినిమాల్లో స్టోరీ లకు బెస్ట్ చాయిస్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంటూ ఉండటంతో.. బాలీవుడ్ టాప్ హీరోలు ఎక్కువగా తాప్సి పై దృష్టి పెడుతున్నారు. దీంతో ఈ సొట్ట బుగ్గల ముద్దుగుమ్మకి వరుస అవకాశాలు దొరుకుతున్నాయి.
Read more: షారూఖ్ సూపర్ బిజినెస్..! అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు..!!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ టాప్ హీరోయిన్ కి లేనిరీతిలో తాప్సీ చేతిలో.. దాదాపు ఐదు ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. అప్పుడు షారు ప్రాజెక్ట్ ఓకే అయినట్లు వార్తలు రావడంతో తాప్సీ క్రేజ్ రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తోంది. ఇదిలా ఉంటే ఒక తాప్సీతో మాత్రమే కాక సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ నయనతార తో కూడా అట్లీ సినిమాలో షారూఖ్ నటించడానికి రెడీ అయినట్లు చాలావరకు సౌత్… టాలెంట్ నటీనటుల పై షారుక్ గురి పెట్టినట్లు తెలుస్తోంది.