Shalini pande : కథ డిమాండ్ చేస్తే ఆ రెండింటీకి సిద్దమంటోంది అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలినీ పాండే. విజయ్ దేవరకొండతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ శాలినీ పాండేకి ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ తీసుకు వచ్చింది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అర్జున్ రెడ్డి. ఇందులో బోల్డ్ పాత్రలో నటించి ఆకట్టుకున్న శాలినీ సొట్ట బుగ్గలతో బొద్దుగా కనిపించి కుర్రాళ్లకి చమటలు పట్టించింది. అలాంటిది ఇప్పుడు హిందీ సినిమా కోసం బాగా సన్నబడింది. శాలినీ బాలీవుడ్లో నటిస్తున్న సినిమా జయేష్ భాయ్ జోర్దార్. ఇందులో ఆమె డాన్సర్‌గా నటిస్తోంది. అయితే కథ డిమాండ్ చేయడం వల్ల సన్నబడినట్టు తెలిపిన ఈ యంగ్ బ్యూటీ కథకి అవసరమైతే మళ్ళీ బరువు పెరగడానికి కూడా రెడీ అంటోంది.
అర్జున్ రెడ్డి తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే 118, ఇద్దరి లోకం ఒకటే సినిమాలతో సరిపెట్టుకుంది. తమిళంలో ఓ సినిమా కమిటయి కూడా బాలీవుడ్లో క్రేజీ ఆఫర్ వచ్చాయని మధ్యలోనే కోలీవుడ్ మేకర్స్ హ్యాండ్ ఇచ్చి ముంబై చెక్కేసింది. ఇలా కమిటయిన తమిళ సినిమాను ఆ మధ్య అర్ధాంతరంగా వదిలి వెళ్ళినందుకు తమిళ చిత్ర పరిశ్రమ నిర్మాతల మండలిలోనూ అమ్మడి మీద కంప్లైట్ చేశారు చిత్ర దర్శక, నిర్మాతలు. కానీ శాలినీ మాత్రం హిందీ సినిమాల కోసం ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు
వచ్చాయి.
Shalini pande : బాలీవుడ్లో ఈమె ఎంత వరకు సక్సెస్ అవుతుందో.
హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ వారితో వరుసగా మూడు సినిమాలను కమిటయింది. అందులో ఒకటి జయేష్ భాయ్ జోర్దార్. కాగా ఆమె హిందీలో మరో మూడు చిత్రాలలో నటిస్తోంది. అవి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పటికే తమిళంలో ఆమె నటించిన 100 % కాదల్, గొరీల్లా వంటి సినిమాలు బాగానే పేరు తీసుకు వచ్చాయి. దాంతో అక్కడ మంచి సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. కానీ బాలీవుడ్ పెద్ద మార్కెట్. రెమ్యునరేషన్ కూడా భారీగా ఉంటుంది. అందుకే హిందీ సినిమాల కోసం బాలివుడ్ లో సెటిలయింది. చూడాలి మరి బాలీవుడ్లో ఈమె ఎంత వరకు సక్సెస్ అవుతుందో.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!