టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి ఒక పెద్ద సంచలనం. పక్కా కమర్షియల్ సినిమాలే వస్తున్న నేపథ్యంలో అర్జున్ రెడ్డి అందరిని మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాకోసం విజయ్ దేవరకొండ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చాలా కష్టపడ్డారు. ప్రముఖ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజా కూడా ఇంకా ఎన్నాళ్ళు మీరు సినిమా చేస్తూనే ఉంటారు..త్వరగా కంప్లీట్ చేయండి అని సలహా ఇచ్చారు. ఇక పెళ్ళి చూపులు లాంటి చిన్న సినిమాతో హీరోగా హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ కి ఆ సినిమాకి ముందే అర్జున్ రెడ్డి రిలీజ్ కావాల్సింది.
ఆర్థిక సమస్యలు..ఇతర కారణాల వల్ల ఆలస్యం అయి పెళ్ళి చూపులు తర్వాత రిలీజయింది. ఇక ఈ సినిమాలో ఉన్న బూతులు ..కొన్ని డైలాగ్స్ లో వల్గారిటీ ఉందంటూనే యూత్ విపరీతంగా అట్రాక్ట్ అయ్యారు. కథలో ఉన్న సోల్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. కేవలం యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని బాగా ఇష్టపడ్డారు. అంతగా సహజంగా తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రెడ్డి. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తర్వాత అంతగా పాపులారిటీని సాధించింది హీరోయిన్ శాలినీ పాండే. చెప్పాలంటే తన పేరు శాలినీ పాండే అన్న విషయం ఫ్యాన్స్ మర్చేపోయారు.
అంతగా ప్రీతి పాత్రలో ఒదిగిపోయి ప్రీతిగానే పాపులర్ అయింది. ఇక ఈ సినిమాకోసం శాలినీ చాలానే కష్టపడింది. ఎంత బోల్డ్ గా నటించాలో అంత బోల్డ్ గా నటించింది. లెక్కలేనన్ని లిప్ లాక్స్ ఇచ్చింది. ఒక సందర్భంలో ఇన్ని లిప్ కిస్ లుంటాయని ముందే తెలిస్తే ఒప్పుకునేదాన్ని కాదేమో అన్న కామెంట్స్ కూడా చేసింది. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో మాత్రం టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. అంతేకాదు యంగ్ హీరోలకి బెస్ట్ ఛాయిస్ అని అందరూ అనుకున్నారు. కాని శాలినీ కి మాత్రం అవకాశాలు అడపా దడపానే వస్తున్నాయి. అర్జున్ రెడ్డి కోసం అంత చేసినా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ప్రస్తుతం తన చేతిలో కోన వెంకట్ నిర్మాణంలో రిలీజ్ కి రెడీగా ఉన్న నిశబ్ధం మాత్రమే ఉంది.