న్యూస్

చరణ్ సినిమాకి సంబంధించి కొత్త అప్ డేట్ చెప్పిన శంకర్..!!

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ప్రారంభంలో శరవేగంగా జరగగా… ఇటీవల ఇండస్ట్రీలో షూటింగులు ఆగిపోవడంతో.. ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్ డేట్ ఇవ్వండి అంటూ అభిమానులు తెగ గోల పెడుతున్నారు. నిర్మాత దిల్ రాజుకి సోషల్ మీడియాలో చుక్కలు చూపించడం జరిగింది. ఇటువంటి తరుణంలో “RC15” గురించి డైరెక్టర్ శంకర్ రియాక్ట్ అయ్యారు. లేటెస్ట్ అప్ డేట్ ఇవ్వటం జరిగింది.

Shankar gave a new update regarding RC15 Charan's movie

“ప్రస్తుతం నేను కమల్ హాసన్ తో ఇండియన్ 2, రామ్ చరణ్ తో “RC15” సినిమా చేస్తున్నాను. ఈ రెండు సినిమాలు షూటింగులు ఒకేసారి జరుపుకుంటున్నాయి. “RC15” సినిమా షూటింగ్ షెడ్యూల్ నెక్స్ట్ హైదరాబాదులో.. అదే రీతిలో విశాఖపట్నంలో జరగనుంది. సెప్టెంబర్ తొలివారంలోనే “RC15” సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాం.. అని శంకర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇండస్ట్రీలో 25వ తారీకు నుండి మళ్లీ షూటింగులు జరుపుకుంటున్న నేపథ్యంలో.. ఆగిపోయిన రామ్ చరణ్ సినిమా షూటింగ్ మళ్లీ కొనసాగుతుందట.

Shankar gave a new update regarding RC15 Charan's movie

దాదాపు సగానికి పైగా సినిమా షూటింగ్ జరుపుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలలో చరణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చరణ్ సరసన కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. చరణ్ కెరీర్ లో ఇది 15వ సినిమా కావడంతో ప్రతి సన్నివేశం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. సినిమాలో ఒక పాత్ర ముఖ్యమంత్రిగా చరణ్ కనిపించనున్నట్లు సమాచారం.


Share

Related posts

Eyebrow: ఐబ్రో త్రెడింగ్ చేయించుకునే ముందు ఇలా చేయండి.. పెయిన్ ఉండదు..!!

bharani jella

కరోనా కట్టడి పై ఫోకస్ పెట్టిన ఏపి‌ సి‌ఎం జగన్

Siva Prasad

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా రాజీనామా

Siva Prasad