Shankar : శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – శిరీష్ కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ ని దిల్ రాజు అధికారకంగా ప్రకటించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరూ మాట్లాడుకుంటుంది ఈ సినిమా కథ ఏంటని. శంకర్ సినిమాలలో కథ ఎంత విభిన్నంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.
చాలా అడ్వాన్స్ గా ఉండే కథ ని సిల్వర్ స్క్రీన్ మీద చూపించి మెస్మరైజ్ చేస్తాడు. చెప్పాలంటే 10 ఏళ్ళ తర్వాత దేశం లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో.. దాని వల్ల సమాజం మీద .. ప్రజల మీద ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయో ముందే చూపిస్తాడు. అందుకే శంకర్ సినిమా కథ గురించి ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తికరంగా మాట్లాడుకుంటారు. ఈ క్రమంలోనే చరణ్ తో శంకర్ ఏ తరహా కథ తీయనున్నాడని టాలీవుడ్ లో చర్చలు సాగుతున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం చరణ్ తో శంకర్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో సినిమాని తెరకెక్కించబోతున్నాడని సమాచారం.
Shankar : శంకర్ ఎంచుకున్న కథా నేపథ్యం సైన్ ఫిక్షన్ ..?
మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు సైన్ ఫిక్షన్ జోనర్ గనక అయితే గ్యారెంటీగా హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమాకి శంకర్ ఎంత బడ్జెట్ పెట్టించబోతున్నాడన్నది హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి ఈ సినిమాకి శంకర్ ఎంచుకున్న కథా నేపథ్యం ఏంటో. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ లేదా హారీస్ జయరాజ్ లలో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.