బిగ్ బాస్ ‘కంటెస్టెంట్’కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన షణ్ముఖ్!

వెండితెర, బుల్లి తెర ల ద్వారా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వారు చాలా మందే ఉన్నారు. చిన్న చిన్న క్యారెక్టర్ల నుంచి ఒక మంచి పాత్రను పోషించే అవకాశాలను చేజిక్కించుకునే వారు కూడా ఉన్నారు. అలాగే ప్రస్తుతం యూట్యూబ్ చానెల్ ఎంతగా ఫేమస్ అయిందో చెప్పక్కర్లేదనుకోండి. యూట్యూబ్ ను ఒక వంతెనలాగా వాడుకుని సినిమాల్లో స్టార్స్ అయిన వారెందరో ఉన్నారు. అలాగే ప్రముఖ ఓటీటీ కూడా అందరికీ తమ టాలెంట్ ను బయటపెట్టుకునేందుకు మంచి ప్లాట్ ఫాం అనే చెప్పుకోవచ్చు. తమకున్న ప్రత్యేకతలను చూపిస్తూ వివిధ రకాల వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ సినీ రంగంలోకి ప్రవేశించినవారు చాలా మందే ఉన్నారు.

అంతెందుకు విజయ్ దేవరకొండ, రాజ్ తరుణ్ లాంటి వారు కూడా షార్ట్ ఫిలిమ్స్ స్థాయి నుంచి స్టార్స్ గా ఎదిగి తమ ప్రత్యేకతలను చాటుకుంటున్నారు. ఇదిలా ఉంటే యూట్యూబ్ ద్వారా తన క్రేజ్ ను పెంచుకుని మిలియన్ల అభిమానులను సొంతం చేసుకున్న వ్యక్తి షణ్ముఖ్. ఈ షణ్ముఖ్ వైవా హర్ష షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అందరికీ పరిచయమై స్టార్ గా ఎదిగాడు. ఇదిలా ఉంటే షణ్ముఖ్ లవ్ లో ఉన్నట్టు ఆ మధ్యన వార్తలు కూడా వినిపించాయి. అదేనండి దీప్తి సునైనాతోనే షణ్ముఖ్ లవ్ లో పడింది. ఈ ముద్దుగుమ్మ మన స్టార్ షణ్ముఖ్ వేసిన స్టెప్పులకు యువత ఫుల్ ఫిదా అయ్యారు.

అయితే యూట్యూబ్ లో కవర్ డ్యాన్సులు చేస్తూ తన డాన్స్ పార్ట్ నర్ అయిన దీప్తి సునైనాతో షణ్ముఖ్ రొమాన్స్ చేశాడని వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరి జంటకు మంచి క్రేజ్ కూడా ఉందండోయ్. వీరిరువురి మధ్య ప్రేమ పుష్పం వికసించిందని బయట టాక్ కూడా నడస్తోంది. కాని దీప్తి సునైనాకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చి అందులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది బిగ్ బాస్ ఇంట్లో దీప్తికి తనీష్ కు మధ్య ప్రేమ నడిచిందని వార్తలు కూడా వచ్చాయి. దాంతో దీప్తి సునైనాకు, షణ్ముక్ మధ్య బ్రేకప్ వచ్చిందని టాక్ కూడా నడిచింది.

ఇదే విషయాన్ని షణ్ముఖ్ ను తన అభిమానులు లైవ్ ఇంటరాక్షన్ లో అడిగితే దానికి సమాధానంగా షణ్ముఖ్ ఇలా సమాధానమిచ్చాడు. తన చేతి మీదున్న టాటూను చూపిస్తూ ఇది ఎంతకాలముంటే అప్పటి వరకు సునైనాపై నా ప్రేమకూడా అలాగే ఉంటుందని సమాధానమిచ్చాడు. అలాగే సునైనా తర్వాత షణ్ముఖ్ తో జంటగా చేసిన వైష్ణవితో కూడా రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపించడంతో షణ్ముఖ్ దానికి ఘాటైన సమాధానం కూడా ఇచ్చారు. వైష్ణవికి ఇప్పుడే పెళ్లి కూడా అయింది.. అనవసరమైన రిలేషన్స్ ను క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టొద్దని ఆయన తన అభిమానులను కోరారు. మొత్తానికి మళ్లీ షణ్ముఖ్, దీప్తి సునైనాలు ముందటిలా గడపడానికి సిద్దమవుతున్నట్టు కనిపిస్తోంది.