Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో.. టాప్ మోస్ట్ కంటెస్టెంట్ లలో ఒకరిగా ప్రస్తుతం చలామణి అవుతున్న షణ్ముఖ్ జస్వంత్.. తన ఫస్ట్ లవ్ దీప్తి సునయన కంటే ముందే ఒకరు ఉన్నారని సీక్రెట్ బయట పెట్టాడు. విషయంలోకి వెళితే బిగ్ బాస్ కంటెస్టెంట్ లు తమ ఫస్ట్ లవ్ స్టోరీ ప్రేక్షకులతో పంచుకోవాలని బిగ్ బాస్ 18వ రోజుల్లో టాస్క్ ఇచ్చినట్లు తాజా ప్రోమో బట్టి రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో సింగర్ శ్రీరామచంద్ర.. తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ ఆ తనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు.
ఇదే క్రమంలో దీప్తి సునయన కంటే ముందే మరొకరిని ప్రేమించినట్లు షణ్ముక్ చేసినంత సరి కొత్త విషయాన్ని బయట పెట్టాడు. ఇక జెస్సీ తాను ఓ అమ్మాయిని ప్రేమించాను అని ఇప్పటికీ ఆమె సింగల్ అయితే తాను మింగల్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక కంటెస్టెంట్ శ్వేతా వర్మ తన లో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయని… అటువంటి ఎమోషనల్ తాను ఫస్ట్ లవ్ చేసిన వ్యక్తి వల్ల తెలుసుకోవడం జరిగిందని.. తెలిపింది. ఇక ఇదే తరుణంలో నటి ప్రియా నేను మ్యారీడా? సెపరేటా? విడాకులయ్యాయా? అనేది నాకే తెలీదంటూ కుమిలిపోయింది ప్రియ.
ఇక ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్.. తన ఫస్ట్ లవ్ గురించి చెప్తూ.. నేను ప్రేమించిన అబ్బాయి బండి వెళ్లిపోతుంటే ఆ బండి వెనక పరిగెత్తుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు అంటూ గుక్క పెట్టి ఏడ్చేసింది. ఆ తరువాత.. హమీద.. తాను ప్రేమించిన వ్యక్తికి తనకు మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదని అదేరీతిలో కలిసి కూడా ఉండలేకపోయా నట్లు తెలిసింది. ఇక సిరి … మాట్లాడుతూ తాను చనిపోయినట్లు సడన్గా ఫోన్ వచ్చిందని.. బోరున ప్రోమోలో విలపించింది. యాంకర్ రవి లడ్డు అనే అమ్మాయిని ప్రేమించినట్లు.. ప్రోమో లో అర్థమవుతుంది.