Shanmukh Jashwanth : ప్రముఖ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ వివాదంలో చిక్కుకున్నాడు. ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ ద్వారా యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిన ఈ నయా స్టార్ తాగి బండి నడిపి మూడు వాహనాలను తన కారుతో ఢీ కొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇక పోలీసు వారు దీనిపై విచారణ చేసి ధృవీకరించి షణ్ముఖ్ జస్వంత్ ను అదుపులోకి తీసుకున్నారు.
స్థానికుల ద్వారా ముందుగా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే షణ్ముఖ్ ఇంటికి వెళ్ళి అతనిని అదుపులోనికి తీసుకున్నారు. దానికి ముందు సంఘటనా స్థలం దగ్గరికి వెళ్లి పరిశీలించిన పోలీసులు ఒక వ్యక్తికి ఆ ఘటనలో గాయపడినట్లు తెలుసుకున్నారు. స్థానికులు చెప్పిన దాని ప్రకారం షణ్ముఖ్ జస్వంత్ మద్యం మత్తులో కారు ని కంట్రోల్ లేకుండా చాలా వేగంగా నడిపాడు అని తెలుస్తోంది.
ఓకే కారు తో మూడు వాహనాలను ఢీ కొట్టడం అంటే…. అతను ఎంతగా తాగి వున్నాడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే బాగా ఫేమస్ అయ్యి నటుడిగా మంచి పేరు తెచ్చుకుని వెలుగులోకి వస్తున్న షణ్ముఖ్ కెరీర్ లో ఇది ఖచ్చితంగా మాయని మచ్చ గా మిగిలిపోతుంది అనే చెప్పాలి.
ఈ ఘటన అతని కెరీర్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. అలాగే గాయపడిన ఆ వ్యక్తి పరిస్థితి గురించి కూడా ప్రస్తుతానికైతే పూర్తి వివరాలు తెలియదు.