Bigg Boss Telugu 5: ఫుల్ హ్యాపీగా ఉన్న షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్స్..!!

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో స్టార్ కంటెస్టెంట్ గా… షణ్ముఖ్ జస్వంత్ పేరు మారు మ్రోగుతున్న సంగతి తెలిసిందే. మనోడు సరిగా ఆడకపోయినా గాని బయట ఓ రేంజిలో క్రేజ్ ఉంది. సోషల్ మీడియా లో యూట్యూబ్ స్టార్ గా… షణ్ముఖ్ నటించిన వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అనేక మంది అభిమానులను సంపాదించుకోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ (shanmukh jashwanth) క్రేజీగా రాణించాలని అభిమానులు ముందునుండి.. అంచనాలు పెట్టుకున్నారు. కానీ షణ్ముఖ్ జస్వంత్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చాక… చాలా బద్దకంగా గేమ్ ఆడుతూ వస్తున్నాడు. ఎక్కువగా మోజో రూమ్ లో… హౌస్ లో తన ఫ్రెండ్స్ సిరి(Siri), జెస్సీ(Jessy) లతో పంచాయతీలు పెట్టుకుంటూ వాళ్ల గురించి వీళ్ళ గురించి… ముచ్చట్లు చెప్పుకుంటున్నాడు. 

Shanmukh Jaswanth's Best Friend Not Rooting For Him to Win Bigg Boss – NewsMyna

హౌస్ లో ఎటువంటి టాస్క్ బిగ్ బాస్(Bigg Boss) ఇచ్చిన గాని… ప్రేక్షక పాత్ర మాదిరిగా మాత్రమే షణ్ముఖ్ జశ్వంత్(shanmukh jashwanth) రాణించడం జరిగింది. దీంతో గత వీకెండ్ ఎపిసోడ్ లో షణ్ముఖ్ జస్వంత్ ఆడిన ఆట తీరు… అలిగిన సందర్భాలు చిన్నపాటి వీడియో రూపంలో క్రియేట్ చేసి నాగార్జున ప్లే చేయటం తో… పాటు అస్సలు టాస్క్ లో… కనీస పార్టిసిపేషన్ లేని రీతిలో… వీడియో ఉండటంతో.. షణ్ముఖ్(shanmukh) ఆటతీరుపై బయట కూడా అభిమానుల నుండి నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. అతన్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నా గాని సరిగా ఆడక పోతే.. మేమేం చేయాలి అన్న రీతిలో… విమర్శల వర్షం కురిపించారు. ఇటువంటి తరుణంలో ఎనిమిదవ వారంలో షణ్ముఖ్ జస్వంత్ ఒక్కసారిగా గతంలో కాకుండా జూలు విదిల్చిన సింహం లాగా…టాస్క్ లలో… చాలా యాక్టివ్ గా… ఆడుతూ ఉండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Shanmukh Jaswanth reveals his girlfriend name

కెప్టెన్సీ టాస్క్ అభయ హస్తం టాస్క్ లో…

ఈ మాత్రం హౌస్ లో రాణిస్తే చాలు షణ్ముఖ్ జస్వంత్ కి… తిరుగు ఉండదు అని బయట చెప్పుకుంటున్నారు. ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో అభయ హస్తం టాస్క్ లో…లోబో పై విజయం సాధించిన సింహం షణ్ముఖ్ జస్వంత్(shanmukh jashwanth) కెప్టెన్సీ పోటీదారులలో ఒకరిగా నిలిచారు. చాలావరకు యాక్టివ్ గా ఉంటూ… మిగతా కంటెస్టెంట్ లకు మంచి పోటీ ఇస్తున్నారు. బ్రెయిన్ వర్క్ తో పాటు ఫిజికల్ గా కూడా… షణు ఆడుతున్నాడని… అభిమానులు చెప్పుకుంటున్నారు అట. మరి ఈవారం కెప్టెన్సీ పోటీలో.. షణు.. గెలుస్తాడో లేదో…చూడాలి. 


Share

Related posts

పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రభాస్.. ఎవరు ముందు ..?

GRK

ఆగకుండా డబుల్ డ్యూటి లు చేస్తున్న పోలీసులు

Siva Prasad

బిగ్ బాస్ 4: హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన హారిక మదర్ మోనాల్ పై సెటైర్లు..!!

sekhar