న్యూస్

Shanmukh Jaswanth : షణ్ముక్ జస్వంత్ ఏజెంట్ ఆనంద్ లో హీరోయిన్ గా దీప్తి సునైనా ??

Deepti - Shanmukh
Share

Shanmukh Jaswanth : యూట్యూబ్ లో షణ్ముఖ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. నటనపై ఆసక్తితో య్యూటూబర్ గా మారాడు. గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య లాంటి వెబ్ సిరీస్ లతో జనాలకు దగ్గరయ్యాడు. యూట్యూబ్ లో తనకున్న క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు షణ్ముఖ్. ఆ సీజన్ లో రన్నరప్ గా నిలిచాడు. ఆ సమయంలో షన్ను కి చాలా మంది మద్దతుగా నిలిచారు. బిగ్ బాస్ నుంచి వచ్చాక షణ్ముఖ్ కు మంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.

shanmukh jaswanth : షన్ను కి దీప్తి సునైనా బ్రేకప్…

Deepti Sunaina

బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన సిరి, షణ్నులు క్లోజ్‌గా ఉండటం, పలుసార్లు హగ్గులు ఇచ్చుకోవడం జరిగాయి. దీంతో వీరిరువురు నెగిటివిటీ ని మూటగట్టుకున్నారు. బిగ్ బాస్ నుండి బయటకు రాగానే.. దీప్తి సునయన, షన్నుకి బ్రేకప్ చెప్పింది. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను.. జీవితం విషయంలో ఎవరి నిర్ణయం తీసుకునే హక్కు వారికుంటుంది. దీన్ని ఎవరూ కాదనలేరు. ఇన్ని రోజులు నాకు సపోర్ట్ గా నిలిచినందుకు కృతఙ్ఞతలు.. నువ్వు ఇచ్చిన సపోర్ట్ ను ఎప్పటికీ మర్చిపోలేను అని తెలుపుతూ షన్ను ఒక పెద్ద లేఖను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. తర్వాత అతను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు.

గుడ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్..

shanmukh jaswanth

ఇకపోతే.. ఈ క్ర‌మంలో బ్రేకప్ తర్వాత దీప్తి సున‌య‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా షణ్ముఖ్ ఆమెకు జన్మదిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ… ఆమెతో క‌లిసి ఉన్న ఒక ఫొటోను షేర్ చేశారు. అందులో ‘హ్యాపీ బర్త్ డే డీ’ అని రాసి దానికి వీరిరువురు క‌లిసి న‌టించిన ‘మ‌లుపు’ అనే ఒక సాంగ్‌ను జ‌త చేశాడు.ఇలా డిప్రెషన్ లో ఉన్న షన్ను ఇక మళ్ళీ వీడియోలు చేయడు అనే కామెంట్లు కూడా వినిపించాయి. వాటన్నింటికి సమాధానంగా ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ పేరు గల వెబ్ సిరీస్ చేయనున్నట్టు తెలిపాడు. ఇందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో దీప్తి సునైనా నటించనునట్లు యూట్యూబ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మళ్లీ దీప్తి షన్ను జంటను యూట్యూబ్ తెరపై వీక్షించే అవకాశం అభిమానులకు లభిస్తుంది.

Deepti-shanmukh : అర్ధరాత్రి నిద్రలోంచి లేచి మరీ .. దీప్తి సునైనా ఇన్ స్టా లో; ఆ స్టోరీ పెట్టడం వెనక షణ్ముఖ్ మీద ప్రేమే కారణమా ?


Share

Related posts

Vikram: ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ రిలీజ్..! ముగ్గురు మొనగాళ్లు ఒకే ఫ్రేమ్ లో..

Muraliak

ఈ కాంగ్రెస్ పార్టీని….బాగు చేయ‌డం ఎవ‌రి త‌రం కాదా?

sridhar

‘సంక్షేమానికి పెద్దపీట’

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar