Shanmukh Jaswanth : తెలుసా మీకు. సోషల్ మీడియాతో ఎక్కువగా పరిచయం ఉన్నవాళ్లకు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షన్ముఖ్ జస్మంత్ Shanmukh Jaswanth సోషల్ మీడియా స్టార్. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో ఫేమస్ అయిపోయాడు. మనోడికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు షన్ముఖ్ కు.
షన్ముఖ్ మంచి డ్యాన్సర్ కూడా. ముందు చిన్న చిన్న వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు షన్ముఖ్ కు సపరేట్ గా ఒక చానెలే ఉంది. షన్ముఖ్.. బిగ్ బాస్ సీజన్ 5లోనూ సెలెక్ట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
Dance+ show లో Shanmukh Jaswanth
సోషల్ మీడియా స్టార్ అయినప్పటికీ.. షన్ముఖ్ పెద్దగా బుల్లితెర మీద కూడా కనిపించడు. అప్పుడప్పుడు చానెళ్లలో వచ్చే షోలలో కనిపిస్తుంటాడు కానీ.. పెద్దగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం లేదు. ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్నాడు. కాకపోతే సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.
తాజాగా డ్యాన్స్ ప్లస్ షోకు గెస్ట్ గా వెళ్లిన షన్ముఖ్.. డార్జీలింగ్ డెవిల్స్ టీమ్ తో డ్యాన్స్ వేసి అదరగొట్టేశాడు. మామూలుగా కాదు. హీరో లేవల్ లో డ్యాన్స్ వేసి.. జడ్జిలను ఫిదా చేసేశాడు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి ఆ వీడియోపై.