Shanmukh Jaswanth : సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించేవాళ్లకు షన్ముఖ్ జస్వంత్ Shanmukh Jaswanth గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు సోషల్ మీడియా స్టార్. షన్ముఖ్ కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. ఆయనకు మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ ఉన్నారు.
ప్రస్తుతం షన్ముఖ్ రూటే సపరేటు. ఆయనకు ఎన్నో ఆఫర్లు వస్తున్నా.. ఆయన ఎక్కువగా వెబ్ సిరీస్ ల మీదనే దృష్టి పెడుతున్నారు. ఇటీవల వచ్చిన సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలుసు. అదే ఊపుతో షన్ముఖ్ తాజాగా సూర్య అనే సరికొత్త వెబ్ సిరీస్ తీస్తున్నాడు.

దానికి సంబంధించిన ఎపిసోడ్ వన్ ను తాజాగా షన్ముఖ్ తన యూట్యూబ్ చానెల్ లో విడుదల చేశాడు. సూర్య ఎపిసోడ్ వన్ విడుదలైన ఒక్క రోజులోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సంపాదించుకోవడంతో పాటు.. యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది.
Shanmukh Jaswanth : మిడిల్ క్లాస్ అబ్బాయిగా సూర్య
సూర్య వెబ్ సిరీస్ లో షన్ముఖ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా నటించాడు. ఇంజనీరింగ్ చదివిన కుర్రాడు ఖాళీ ఖాళీగా తిరుగుతూ.. తండ్రి చేతిలో తిట్లు తింటూ ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతున్న క్యారెక్టర్ లో షన్ముఖ్ నటించాడు.
ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా సూర్య వెబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్ ను చూసేయండి.