Shanmukh Jaswanth: షణ్ముఖ్ అసలు బిగ్‌బాస్‌కి వెళ్లకుండా ఉండవలసింది.. ఈ మాట అన్నది ఎవరో కాదు..

Share

Bigg Boss: ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ బిగ్‌బాస్‌ సీజన్-5లో పాటిస్పేట్ చేసి ఫస్టు రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. నిజానికి తనకున్న పాపులారిటీకి షణ్ముఖ్ కచ్చితంగా ఈసారి టైటిల్ సొంతం చేసుకుంటాడని భావించారంతా. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. షణ్ముఖ్ రాముడు మంచి బాలుడు అనే టైపు అని జనాల నోళ్లలో నానేది. కానీ బిగ్‌బాస్‌ తర్వాత అతడు ఒక చీటర్ అనే ముద్ర పడిపోయింది. దీప్తి సునైనా (Deepthi Sunaina) బ్రేకప్ చెప్పడం.. ఈ విషయం ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారడం కూడా షణ్ముఖ్ ను మరింత బాధిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క చాలా సినిమా ఆఫర్లు వస్తున్నా కూడా షణ్ముఖ్ హ్యాపీగా ఉండలేకపోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో షణ్ముఖ్ అసలు బిగ్‌బాస్‌కి వెళ్లకుండా ఉండాల్సింది వాళ్లు అనడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

Shanmukh Jaswanth: ఈ మాట అన్నది ఎవరో కాదు


ఒకరికి ఒకరు తమ పేర్లను చేతులపై టాటూ వేయించుకునేంత గాఢంగా దీప్తి-షణ్ముఖ్ ప్రేమించుకున్నారు. కానీ వీరి ప్రేమలో పుల్ల పెట్టి కూర్చున్నారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. మొదట్లో ఆడాలా వద్దా అనే పూర్తి అయిష్టతతో ఉన్న షణ్ముఖ్ ను మునగచెట్టు ఎక్కించి అమాంతం ఒక్కసారిగా కింద పడేసారు. హౌజులో ఒకే బెడ్ లో దుప్పట్లు కప్పుకుని మరీ సిరి హనుమంత్ (Siri Hanmanth)తో రొమాన్స్ చేసేలా పురమాయించారు. దీనితో వారి బుట్టలో పడి షణ్ముఖ్ దీప్తి గురించి మర్చిపోయి రెచ్చిపోయాడు. ఒకవేళ బిగ్‌బాస్‌కి వెళ్లకపోతే షణ్ముఖ్ ఏ అమ్మాయితోనూ వెగటు వేషాలకు దిగేవాడు కాదేమో. తాజాగా సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా ఇదే మాట అంటున్నారు. బిగ్‌బాస్‌ ఒక బ్యాడ్ షో అని.. ఇక్కడి బ్యాడ్ వాతావరణం.. బ్యాడ్ గర్ల్స్ వల్లే షణ్ముఖ్ అలా చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు, సన్నిహితులు అంటున్నారు. షణ్ముఖ్ అసలు బిగ్‌బాస్‌కి వెళ్లకుండా ఉండవలసిందని కూడా నిట్టూరుస్తున్నారు.

దీప్తి కంటే షణ్ముఖ్ లైఫ్‌లో ఎక్కువేముంటుంది

గత అయిదేళ్లుగా దీప్తి, షణ్ముఖ్ గొప్ప లవ్ బర్డ్స్ గా తమ కళ్ల ఎదుటే అందమైన జీవితాన్ని గడిపారని.. కానీ బిగ్‌బాస్‌ వల్ల అంతా సర్వనాశనం అయ్యిందని సన్నిహితులు అంటున్నారు. దీప్తి కంటే షణ్ముఖ్ లైఫ్‌లో ఎక్కువేముంటుందని.. దీప్తి తన జీవితం నుంచి వెళ్లిపోవడంతో అతడు లోలోపల చాలా బాధ పడుతున్నాడని కుటుంబ సభ్యులు కూడా నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. షణ్ముఖ్ మాత్రం ప్రస్తుతానికి తన పర్సనల్ లైఫ్‌ను పక్కనపెట్టి కెరీర్‌పై ఫోకస్ చేసేందుకు పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. అలాగే సిరితో తను రిలేషన్ పెట్టుకున్నట్టు వస్తున్న వార్తలపై సున్నితంగా స్పందిస్తూ తాను సింగిల్ అని చెప్పుకుంటున్నాడు.


Share

Recent Posts

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

19 mins ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

2 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

3 hours ago

ఆ కమెడియన్ లక్ మామూలుగా లేదు.. ఒకేసారి డబుల్ జాక్‌పాట్!

  ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…

3 hours ago

కరణ్ జోహార్‌లోని మరో చెడు గుణం బట్టబయలు.. ఇలాంటి వారు ఉంటే సినీ ఇండస్ట్రీ ఏమైపోవాలి?

  బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్‌ అంతటా పెంచేందుకు కరణ్…

3 hours ago

రాజమౌళి బాటలో డైరెక్టర్ పూరి జగన్నాథ్..??

ప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమొగుతున్న సంగతి తెలిసిందే. "బాహుబలి 2", "RRR" సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు…

4 hours ago