Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ తెలుసు కదా. సోషల్ మీడియా స్టార్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా షణ్ముఖ్ గురించే. షణ్ముఖ్ ఏం చేసినా అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ తో ఫుల్ ఫేమస్ అయ్యాడు షణ్ముఖ్. అప్పటి నుంచి షణ్ముఖ్ ఏం చేసినా సోషల్ మీడియాలో సంచలనమే. అది షణ్ముఖ్ రేంజ్.

సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ సూపర్ సక్సెస్ అయ్యాక ఇక షణ్ముఖ్ వెనకకు అడుగు వేయలేదు. ప్రస్తుతం సూర్య వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు షణ్ముఖ్. సూర్య వెబ్ సిరీస్ కు సంబంధించిన నాలుగు ఎపిసోడ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. అవి యూట్యూబ్ లో సంచలనాలను సృష్టించాయి. అవి విడుదల అవడమే ఆలస్యం… యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి.
Shanmukh Jaswanth : నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఐదో ఎపిసోడ్
తాజాగా సూర్య వెబ్ సిరీస్ ఐదో ఎపిసోడ్ రిలీజ్ అయింది. రిలీజ్ అవడమే ఆలస్యం… యూట్యూబ్ లో ఆ ఎపిసోడ్ నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. యూట్యూబ్ లో రోజూ వేల సంఖ్యలో వీడియోలు రిలీజ్ అవుతాయి కానీ… షణ్ముఖ్ ఒక్క వీడియో పెట్టినా చాలు… అన్ని వీడియోలను తోసిరాజని షణ్ముఖ్ వీడియో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంటుంది. తాజాగా షణ్ముఖ్ సూర్య వెబ్ సిరీస్ కూడా అలాగే నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది.
ఇంకెందుకు ఆలస్యం… సూర్య వెబ్ సిరీస్ ఎపిసోడ్ 5 ని వెంటనే చూసేయండి.