Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ తెలుసు కదా. సోషల్ మీడియా స్టార్. సోషల్ మీడియాలో సూర్యకు ఉన్న పాపులారిటీ మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో ఉన్న ఏ ప్లాట్ ఫాంలో చూసినా షణ్ముఖ్ కు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. అది షణ్ముఖ్ రేంజ్. సోషల్ మీడియాలో షణ్ముఖ్ ఒక పిక్ పెట్టినా చాలు… లక్షల్లో లైక్స్, కామెంట్స్, షేర్స్ వస్తాయి. అది షణ్ముఖ్ రేంజ్.

సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో యూట్యూబ్ లో రికార్డులను తిరగరాశాడు షణ్ముఖ్. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ఎంత సూపర్ సక్సెస్ అయిందో తెలుసు కదా. షణ్ముఖ్ కు ఆ వెబ్ సిరీస్ ఎంతో పేరును తీసుకొచ్చింది. సోషల్ మీడియా స్టార్ గా నిలబెట్టింది.
Shanmukh Jaswanth : నెంబర్ వన్ ట్రెండింగ్ లో సూర్య వెబ్ సిరీస్ ఎపిసోడ్ 6
ఇప్పటికే సూర్య వెబ్ సిరీస్ ఐదు ఎపిసోడ్స్ రిలీజ్ అయి యూట్యూబ్ లో సంచలనాలను సృష్టించాయి. తాజాగా సూర్య వెబ్ సిరీస్ ఎపిసోడ్ 6 రిలీజ్ అయింది. రిలీజ్ అయిన గంటలోనే మిలియన్ల వ్యూస్ ను సాధించింది సూర్య వెబ్ సిరీస్. అసలు.. పెద్ద సెద్ద స్టార్ హీరోల సినిమాల ట్రైలర్లు, టీజర్లు విడుదలైనా ఇంత షార్ట్ టైమ్ లో అన్ని మిలియన్స్ వ్యూస్ సాధించడం కష్టం. కానీ… షణ్ముఖ్ కు యూట్యూబ్ లో ఎంత పాపులారిటీ ఉందో… సూర్య వెబ్ సిరీస్ లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తేనే అర్థం అవుతోంది.
ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా సూర్య వెబ్ సిరీస్ లేటెస్ట్ ఎపిసోడ్ ను చూసేయండి.