Shanmukh: సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన షణ్ముఖ్, దీప్తి సునయన జంట గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు కలిసి పలు కవర్ సాంగ్స్ మరియు షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. ఇక సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ వున్న ఫాలోయింగ్ గురించి కూడా తెలిసిందే. బిగ్ బాస్ దెబ్బకి దీప్తి షణ్ముఖ్ జశ్వంత్కి విడాకులు ఇచ్చింది. అదేనండి బ్రేకప్. వారు విడిపోతున్నట్లు తన ప్రేయసి దీప్తి సునయన సోషల్ మీడియా వేదికగా పెద్ద పోస్ట్ పెట్టింది. దాంతో షణ్ముఖ్ కూడా మా దారులు వేరని, ఇక మా బంధం 5 ఏళ్ళు అందంగా గడిచిందని తెలిపాడు. ఇక ఈ తంతు ఇంచుమించు అందరికీ తెలిసినదే.
Over Eating: ఫుల్ గా తినేశారా..!? ఇవి అస్సలు మర్చిపోవద్దు..!!
Shanmukh: షణ్ముఖ్ జస్వంత్ పెట్టిన ఇన్ స్టా స్టోరీ కహానీ..
ఇకపోతే వీరి యవ్వారాలు ఎలావున్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా వుంటారు. ఈ క్రమంలో తాజాగా షణ్ముఖ్ పోస్ట్ చేసిన విషయం కాస్త వైరల్ అవుతోంది. విషయంలోకి వెళితే, దీప్తి ఏ ముహూర్తమున బ్రేకప్ చెప్పిందోగాని ఇక అప్పుడు నుండి సోషల్ మీడియాలు వీరిని టార్గెట్ చేసాయి. వారికి మంచి ఫీడ్ దొరికింది. ప్రతిరోజూ ఇలా.. వారిగురించి కథనాలే. సదరు కంటెంట్ ని గమనించిన షన్ను కొంచెం అసహనానికి గురవుతూ.. ‘ఎదవ గోల ఇంకెన్నాళ్ళరా బాబూ.. ఇకనైనా ఆపండి!’ అంటూ వాపోయాడు.
MP RRR: రెబల్ ఎంపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన స్పీకర్..! వైసీపీ మొదటి గెలుపు!?
షన్ను గురించి ఈ విషయాలు తెలుసా?
2013లో విడుదలైన వైరల్ వీడియో ‘ది వైవా’తో తన కెరీర్ ను ప్రారంభించాడు. 2012లో తన స్వంత యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి కవర్ సాంగ్స్ , షార్ట్ ఫిల్మ్ లు కామెడీ వీడియోలను అప్లోడ్ చేశాడు. తర్వాత కె.సుబ్బు దర్శకత్వం వహించిన సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ లో షన్ను అనే పాత్రతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ సిరీస్ 31 జూలై 2020 న తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయబడింది. విడుదలైన తర్వాత ప్రేక్షకులు నుండి విస్తృత స్పందన వచ్చింది.