మండలి చైర్మన్ కుర్చీలో షరీఫ్

అమరావతి, ఫిబ్రవరి 7: రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా ఎంఎ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. శాసనమండలిలో గురువారం చైర్మన్ ఎన్నిక లాంఛనం పూర్తి అయ్యింది. ఈ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఇన్‌చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం ప్రకటించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర నేతలు షరీఫ్‌ను చైర్మన్ స్థానం వద్దకు తీసుకువెళ్లగా ఆయన  బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ షరూక్‌ను మంత్రిగా, షరీఫ్‌ను చైర్మన్‌గా నియమించి మైనార్టీలకు రెండు కీలక పదవులు అప్పగించామని అన్నారు. షరీఫ్ ఆధ్వర్యంలో మండలిలో వ్యవహారాలు సజావుగా సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.