NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రాజకీయం గత రెండేళ్లుగా ఊహించిన విధంగా ట్విస్టుల‌ మీద ట్విస్టులతో నడుస్తోంది. తన అన్నను రాజకీయంగా విభేదించిన షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికలలో తన అన్నను గెలిపించాలని షర్మిల తో పాటు షర్మిల తల్లి వైయస్ విజయలక్ష్మి కాలికి బలపం కట్టుకుని ఏపీ అంతటా పర్యటించారు. ఏపీలో పలు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి తన అన్నను ముఖ్యమంత్రిని చేస్తే ఆంధ్రప్రదేశ్ దశాదిశా మారిపోతుందని ఒకటే ప్రచారం చేసింది ష‌ర్మిల‌. చివరకు టిడిపి యువనేత అప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో కూడా షర్మిల ప్రచారం చేశారు.

పప్పు లోకేష్ ను ఓడించాలని పిలుపు ఇచ్చారు. పప్పు లోకేష్ ని ఓడిస్తే మంగళగిరి అభివృద్ధి అద్భుతం అంటూ కీర్తించారు. కట్ చేస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకే షర్మిల తన అన్నను విభేదించడం మొదలుపెట్టారు. కారణాలు ఏవైనా వీరిద్దరికి మధ్య ఎక్కడ ? చెడిందో తెలియదు కానీ తన అన్న మీద కోపం తీర్చుకునే విషయంలో షర్మిల తప్పటడుగులు వేశారు. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఆ పార్టీకి ఆమె అధ్యక్షులుగా ఉన్నారు. తెలంగాణ అంతట ఏడాదిపాటు విస్తృతంగా పర్యటించారు.. పాదయాత్ర చేశారు. అయితే తెలంగాణ ప్రజల్లో షర్మిల పట్ల ఏమాత్రం సానుభూతి లేదు.

ఆమె పాలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకున్నా.రు చివరకు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అయినా కూడా ఆమె ఎమ్మెల్యే సీటు కూడా తెచ్చుకోలేకపోయారు. రేవంత్ రెడ్డి కూడా షర్మిల కాంగ్రెస్ లో ఎంట్రీ ఇవ్వటాన్ని విబుధించారు. ఆ తర్వాత షర్మిల కాన్సన్ట్రేషన్ ఏపీ వైపుకు మళ్ళింది. పార్టీలో చేరిన వెంటనే షర్మిలను ఏఐసీసీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించారు. అక్కడ నుంచి ఆమె తన అన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో 175 అసెంబ్లీ … 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది.

ఇప్పటికే వివిధ అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థులను ఎంపిక చేసిన అధిష్టానం ఈనెల 25న తొలి జాబితాను విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ఏ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తారు అంటూ ఒకటే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. షర్మిల పార్లమెంటుకి పోటీ చేస్తారా ? లేదా అసెంబ్లీకి పోటీ చేస్తారా అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. విశ్వస‌నీయ‌ వర్గాల సమాచారం ప్రకారం షర్మిల కడప లోక్సభ నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఏఐసీసీ పెద్దలు షర్మిలకు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని నియోజకవర్గాలలో పోటీ చేయనున్నారు.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju