తన సింగిల్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు యంగ్ హీరో శర్వానంద్. త్వరలో రక్షితా రెడ్డితో ఆయన ఏడు అడుగులు వేసి పెళ్లి బంధంలోకి అడుగు పెట్టనున్నారు. గురువారం ఉదయం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి తేదీని కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. శర్వానంద్-రక్షిత నిశ్చితార్థానికి టాలీవుడ్ సెలబ్రిటీలు, యంగ్ హీరోలు, కమెడీయన్లు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రక్షితా రెడ్డి ఎవరు?
తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి-సుధారెడ్డి దంపతుల కుమార్తె రక్షిత రెడ్డి. శ్రీకాళహస్తి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు. అయితే మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డికి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మామ అవుతారు. ఒకవిధంగా రక్షితరెడ్డి.. గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అవుతుంది. వృత్తిరీత్యా రక్షిత రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది.

నిశ్చితార్థంకు హాజరైన సెలబ్రిటీలు వీళ్లే..
హీరో శర్వానంద్ నిశ్చితార్థంకు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, అక్కినేని నాగార్జున దంపతులు, రామ్ చరణ్ దంపతులు, అల్లరి నరేష్ దంపతులు, సాయిరామ్ శంకర్ దంపతులు జంటగా హాజరయ్యారు. రానా, నాని, నితిన్, అక్కినేని అఖిల్, శ్రీకాంత్, తరుణ్, నవీన్, వెన్నెల కిషోర్ తదితరులు హాజరయ్యారు. అయితే హీరో సిద్ధార్థ్-హీరోయిన్ అదితి రావు జంటగా దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరూ సంప్రదాయ దుస్తువుల్లో సందడి చేశారు.

ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. తాను హీరోగా రీసెంట్‌గా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ సినిమాతో మంచి హిట్‌ని కొట్టాడు శర్వానంద్. ఈ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ బయటకు రాలేదు. అయితే ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చే ఆస్కారం కనిపిస్తోంది.



